జ‌ర్న‌లిస్ట్ ల‌కే నోబెల్ శాంతి పుర‌ష్కారం

Dabbeda Mohan Babu
ప్ర‌పంచ వ్యాప్తంగా శాంతి ని నెల‌కొల్పేందుకు ప్ర‌య‌త్నించిన వ్య‌క్తుల‌కు ప్ర‌తి ఏడాది అత్యంత గౌర‌వ‌మైన నోబెల్ బ‌హుమ‌తి ఇస్తు ఉంటారు. ఇప్ప‌టికే నార్వే నోబెల్ క‌మిటీ వారు ఈ ఏడాది కి సంబంధించి ప‌లు రంగా ల్లో అత్యంత ప్ర‌తిభ క‌ల వారికి నోబెల్ పురష్కారం ఇస్తూ వ‌స్తున్నారు. అందులో భాగంగానే శుక్ర వారం శాంతి విభాగంలో నోబెల్ బ‌హుమ‌తిని ప్ర‌క‌టించారు. అయితే ఈ ఏడాది నోబెల్ శాంతి పుర‌ష్కారం ఇద్ద‌రు ఇన్వెస్టిగేటీవ్ జ‌ర్న‌లిస్ట్ ల‌కు వ‌రించింది. నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇలా జ‌ర్న‌లిస్ట్ ల‌కు రావ‌డం నోబెల్ చ‌రిత్ర లో నే మూడో సారి. మొట్ట మొద‌టి సారి నోబెల్ శాంతి బ‌హుమ‌తి 1907 లో వ‌చ్చింది. త‌ర్వాత రెండో సారి 1935 లో ఇన్వెస్టిగేటీవ్ జ‌ర్న‌లీస్ట్ ల‌కు వ‌రించింది. మ‌ళ్లి ఈ సంవ‌త్స‌రం ఇన్వెస్టిగేటీవ్ జ‌ర్న‌లీస్ట్ ల‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి వ‌చ్చింది.


ఈ ఏడాది జ‌ర్న‌లిస్ట్ లో ఉత్త‌మ ప‌రిశోధ‌న‌లు చేసిన మ‌రియా రెసా, రిమిత్రి మురాటోన్ ల‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి వ‌రించింది. మ‌రియా రెసా ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన వారు. రెసా సొంతంగా ఒక న్యూస్ వెబ్ సైట్ ను న‌డుపుతున్నారు. ఈ వెబ్ సైట్ లో హ‌త్యా రాజ‌కీయాల గురించి, మాద‌క ద్ర‌వ్యాల గురించి చాలా లోతైన క‌థ‌నాలు రాసే వారు. ఈ విష‌యాల‌పై ఫిలిప్పిన్స్ దేశ అధ్య‌క్షుడు రోడ్రిగో పాల‌న పై కూడా విమ‌ర్శ‌లు చేస్తూ క‌థ‌నాలు రాసేవారు. వీటిపై ఎంత మంది భేదిరింపుల‌కు పాల్ప‌డిన ఏమాత్రం జంక కుండా నిజాల‌ను ప్ర‌సారం చేసే వారు ఈ స‌హసానికి రెసా కు నోబెల్ బ‌హుమ‌తి వ‌చ్చింది. అలాగే దిమిత్రి  మురాటోన్ ర‌ష్య దేశానికి చెందిన వాడు. ఇత‌డు నోవాయా గెజెటా అనే పత్రిక ను న‌డుపుతాడు. ర‌ష్య లో జ‌రుగుతున్న అక్ర‌మాల ఇన్వెస్టిగేటీవ్ జ‌ర్న‌లిజం ద్వారా బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ జేసేవాడు. ఇందు కు గాను దిమిత్రి కి నోబెల్ బ‌హుమ‌తి వ‌రించింది. నోబెల్ బ‌హుమ‌తి తో పాటు 11.4 ల‌క్ష‌ల డాల‌ర్లు అన‌గా రూ. 8.2 కోట్లు స‌మానం గా పంచుతారు.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: