విజయం మీదే: ఈ ఒక్క పని చేస్తే ఉన్నత స్థాయిలో ఉంటారు ?

VAMSI
ఎంతో మంది జీవితంలో ఏవేవో చేయాలనుకుంటూ ఉంటారు. కానీ అన్నీ సాధ్యం కావు. దీనికి కారణం మీ యొక్క పని తీరే అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఒక పనిని సాధించాలి అనుకున్నప్పుడు దానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలి. చివరి కంటూ పోరాడాలి. అప్పుడే అది మీకు సొంతమవుతుంది. అయితే మీరు సదరు పని కోసం చేసే అన్ని ప్రయత్నాలకు మూలం ఒక్కటే. మనిషి అన్నాక పొద్దున్నే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి అని సైంటిస్ట్ లు చాలా మంది చెబుతున్నారు. ఎందుకో తెలీదు కానీ ఎక్కువ శాతం మంది వేకువనే నిద్ర లేవడానికి ఇష్టపడరు. ఈ కాలంలో అయితే మరీ ఎక్కువగా ఈ యువత రాత్రిళ్ళు పార్టీలని పబ్ లని ఎప్పుడో అర్దరాత్రికి వచ్చి పడుకుంటున్నారు. ఇక అప్పుడు వచ్చి పడుకుంటే ఇక లేచేది ఏముంటుంది.
అయితే కొంత మంది మానసిక నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ రకమైన పద్ధతి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. లైఫ్ లో మంచి స్థాయిలో ఉండాలి అనుకునే వారు ఖచ్చితంగా వేకువనే నిద్ర లేవాలి అని చెబుతున్నారు. ఇలాంటి వారిలో మెదడు చాలా చురుకుగా పని చేస్తుందని తెలుస్తోంది. ఆ రోజంతా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ పనులన్నీ చకచకా చేసుకుపోతారట. తొందరగా నిద్ర లేచే వారు ఎక్కువ శక్తిని కలిగి ఉంటారు. ఇది కొన్ని సర్వే ల ద్వారా వెలువడిన విషయం అని మానసిక నిపుణులు తెలియచేస్తున్నారు. అంతే కాకుండా వీరు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారని తెలుస్తోంది.
ఎటువంటి సమస్య వచ్చిన తట్టుకుని నిలబడతారట. పని ఒత్తిడి ఎంత ఉన్నా ఇలాంటి వారిని ఏమీ చేయలేదని తెలుస్తోంది. ఇన్ని ఫలితాలు ఉన్నాయి కాబట్టే పొద్దున్నే లేవాలి. అయితే మీరు పొద్దున్న త్వరగా లేవాలంటే రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఈ అలవాటును పెంపొందించుకోండి మీరు ఖచ్చితంగా లైఫ్ లో అనుకున్న స్థాయికి చేరుకుంటారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: