విజయం మీదే: పాత జ్ఞాపకాలే విజయానికి అడ్డు కాగలవు... ?
ఉదాహరణకు ఎవరైనా మనల్ని నలుగురిలో చాలా తక్కువ చేసి మాట్లాడినా, చులకనగా చూసినా అవి మనల్ని ఎంతగానో బాధిస్తాయి. అందుకే వారు ఉన్న చోటుకు కాని, నలుగురిలో కలవడానికి కానీ ఇబ్బందిగా భావిస్తూ పాత జ్ఞాపకాలను తలుచుకుని అక్కడే ఆగి పోతుంటారు. కానీ ఇలా చేయడం ముందుకు సాగడం సరి కదా కనీసం ఉన్న చోట కూడా సంతోషంగా కూడా ఉండలేము. ఎపుడైతే ఆ చెడు అనుభవాలను సవాళ్లుగా తీసుకొని అడుగులు వేస్తామో, చులకనగా మాట్లాడిన వారి ముందే అందరితో గౌరవించబడతామో అప్పుడే మనం విజయం సాధించినట్టు. అంతే కానీ జరిగిన దానినే తలుచుకుంటూ బాధపడటం కాదు.
జ్ఞాపకాలు అనేవి మన గతం లోనే ఉండాలి. కాని వర్తమానంలో కూడా వాటి భారాన్ని మోస్తూ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు. అందుకే ఆనందాన్ని కలిగించే జ్ఞాపకాలను సంతోషంగా మనతో కొనసాగించవచ్చు. కానీ చేదు అనుభవాలను, భాద పెట్టే జ్ఞాపకాలను మాత్రం అస్సలు మన దరికి చేరనీయ కూడదు. వాటి ఎఫెక్టు మన భవిష్యత్తుపై పడే ప్రమాదం ఉంది. కాబట్టి రేపు జరగబోయే వాటి గురించి ప్లాన్ చేసుకుని ముందుకు సాగితే గెలుపు మీదే.