విజయం మీదే: మిత్రమా... నీ బలమేమిటో తెలుసుకో ?

VAMSI
వినూత్న సంఘటనల సమాహారమే జీవితం. ఈ జీవితం అందరికీ ఒకే విధముగా ఉండదు. ఒకరికి ఉన్న పరిస్థితులు మనకు ఉండవు. అందుకే వారేంటి బాగున్నారే...మరి నేనెందుకు ఇలా ఉన్నాను అంటూ ఒకరితో పోల్చుకోవడం తగదు. ఎవరి శక్తి, తాహతు, అదృష్టం ఎలా ఉంటే అలాగే అన్నీ జరుగుతాయి. నీలో ఏముందో నువ్వు తెలుసుకో...నీ శక్తిని నువ్వు నమ్ము. శక్తి వంచన లేకుండా కృషి చేయి. ఫలితం గురించి ఆలోచించకు. ఇంకా నీ జీవితం చాలా ఉంది. గడిచిన కొంత జీవితానికే అలసిపోయానని అనుకున్నావో అంతే నీ జీవితం ఒక్క ఇంచు కూడా ముందుకు కదలదు సరికదా అంత కన్నా దారుణంగా తయారవుతుంది. నీ మనసులో గెలవాలి అనే ఆలోచన ఉంటే ఇంకేమీ ఆలోచించకూడదు, కష్టపడడమే నీ పనిగా పెట్టుకోవాలి.
ప్రతి రోజూ కూడా నిద్ర లేవగానే ఆ రోజు మీరేమి చేయాలి అనేది ఆలోచించాలి. ఆ రోజుకి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి దానిని ఎటువంటి పరిస్థుల్లో ఫీల్ అవకుండా ఆలస్యం అవ్వకుండా సాధించండి. అంతే కానీ ఈ రోజు ఈ పని ఉంది నేను చేయగలనా అనే ఆలోచన వచ్చిందా ? ఖతం... అక్కడే నీ ఓటమికి అడుగు పడుతుంది. గెలవాలి అనే ఆశ.. గెలిచేలా పని చేయగలను అనే ఆసక్తి రెండూ మీలో ఉండాలి. ఈ ఆసక్తే లేనప్పుడు జీవితంలో నువ్వు గెలుపు రుచు చూడలేవు ఇది తథ్యం. ఇంకా కొందరైతే నాకు కనుక కొంచెం డబ్బు ఉంటే నేను ఏదొక ఒక విధంగా బాగుపడేవాడిని అంటూ పనికిరాని వృధా మాట్లాడు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారు ఒక్కటే గుర్తించుకోండి.
నీకు లేని దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు. మొదట నీలో ఏముందో దానిని సక్రమంగా వాడుకో, తర్వాత లేనిదాని గురించి ఆలోచించవచ్చు. ఇలాంటి నెగటివ్ ఆలోచనలు మీలో కలుగకుండా చూసుకోవాలి. అప్పుడే మీరు సగం సక్సెస్ అయినట్టు. కాబట్టి... ఎప్పుడూ మీ బలహీనతల గురించి ఆలోచించకండి. నీ బలమేమిటో ఆలోచించండి, దానిని మరింత బలంగా తయారుచేసుకుని నీ విజయాన్ని సాధించడానికి ఉపయోగించండి.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: