యువతా... స్టార్టప్ వైపు పరుగులు తీస్తున్నారా ?

VAMSI
ప్రపంచమంతా ఇప్పుడు స్టార్టప్ ల పర్వం నడుస్తోంది. ఎందరో యువకులు ఈ స్టార్టప్ ల వైపు తమ అడుగులేస్తున్నారు. కానీ దీని కోసం చాలా శ్రమ పడాల్సి వస్తుంది. చాలా మంది ఏమని ఆలోచిస్తారంటే... స్టార్టప్ అంటే మంచి సామర్ధ్యం కలిగిన టీమ్, సరిపోయినంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలని... కానీ ఇలా సాధ్యం కాదని మీరంతా అర్ధం చేసుకోవాలి. వీటిలో ప్రతి దగ్గర మీరే కనబడుతున్నారు. మీ ఆశయమే కనిపిస్తోంది. పై విధంగా మీరు పెద్ద గ్రూప్ తో మంచి పెట్టుబడితో కంపెనీని స్థాపించినా, ఎంతో కష్టపడి పనిచేసినా అనుకున్న విధంగా ఫలితాలను పొందడం వీలుకాదు. ఈ ప్రక్రియ మొత్తంలో మీరే సర్వాధికారిగా కనిపిస్తారు. అంతటా మీ పాత్రే ఉంటుంది. కానీ ఏ విధంగా స్టార్టప్ చేయాలనే దాని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
* ముఖ్యంగా స్టార్టప్ లో ఏకపక్షం కాకూడదు. ఒక గ్రూప్ అంతా కలిసి సక్సెస్ కోసం చేసే పూలబాట. ఈ ప్రక్రియలో గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది. ఇలా అయితేనే మీరు అనుకున్నది సాధించడానికి వీలవుతుంది. విజయం సాధిస్తే అందులో ప్రతి ఒక్కరి శ్రమ కనిపించాలి.  
 * పోటీతత్వం బయట ఎలా ఉందో ఒక అవగాహన ఉండాలి. మనము క్రికెట్ ఆడే గ్రౌండ్ లో ఉండే పోటీ, మార్కెట్ లో మనకు ఎదురయ్యే పోటీ రెండూ ఒక్కటి కాదు. ప్రస్తుతం మార్కెట్ లో ఉండే కష్టాన్ని తట్టుకుని నిలబడడం చాలా కష్టం.
* మీరు కలిసి చేసే బృందం పనితీరును పరిశీలిస్తూ ఉండాలి. మీరు ఎలా అయితే ప్లాన్ చేశారో ఆ విధంగా గ్రూప్ లోని వ్యక్తులంతా కష్టపడుతున్నారా లేదా అని గమనిస్తూ ఉండాలి. మీ గ్రూప్ లోని సభ్యులపై వారు చేయగలరు అనే నమ్మకాన్ని కలిగించాలి. అలాంటప్పుడే మీరు కలలు కన్నా స్టార్టప్ సక్సెస్ అవుతుంది.  
* ఎప్పటికప్పుడు పనితీరులో కలుగుతున్న సమస్యలను గ్రూప్ తో చర్చించి పరిష్కరించుకుంటూ ఉండాలి. ఈ డిస్కషన్ సమయంలో ప్రతి ఒక్కరికీ సమస్య గురించి వివరించే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఎవరిలో ఎంత సామర్ధ్యం ఉందనేది ఎవ్వరూ ఊహించలేము.
ఇవి కొన్ని విషయాలు మాత్రమే. మరో సారి స్టార్టప్ గురించి మిగిలిన విషయాలను తెలుసుకుందాము.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: