విజయం మీదే: పోటీతత్వం మీలో విజయ కాంక్షను రగిలిస్తుంది... !

VAMSI
మనుషులందరూ ఒకటే కానీ వారి వారి వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు, జీవితాలు వేరుగా ఉంటాయి. ప్రతి ఒక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఆ ఆశయాన్ని అందుకోవాలని ఆకాంక్ష ఉంటుంది. అయితే మనం అనుకున్న స్థాయికి చేరుకోవాలంటే అహర్నిశలు శ్రమించక తప్పదు. అనుకున్నది సాధించేవరకు నిద్ర పోకూడదు అని అంటారు పెద్దలు. మనం వెళ్లే దారిలో ఎన్నో ఇబ్బందులు కలుగవచ్చు. కొన్ని సార్లు ఎదుటి వారి వల్ల సమస్యలు కూడా తలెత్తవచ్చు అలాంటప్పుడు ఎలాగోలా వాటిని అధిగమించి ముందుకు సాగాల్సి ఉంటుంది. వాటిని పరిష్కరించకపోయినా లేక నిరుత్సాహపడినా మన ప్రయాణం అక్కడితో ఆగిపోతుంది. గమ్యాన్ని చేరడం అసాద్యంగా మారిపోతుంది.
నేటి ఆధునిక కాలంలో అందరూ తమ తమ గుర్తింపు కోసం పరుగులు తీస్తున్నారు. లక్ష్యాన్ని అందుకోవాలని ఆరాట పడుతున్నారు. విజయం అంటేనే పోటీ, ఇతరులతో పోటీ పడి ముందుకు వెళ్లాలి. మనతో మనకే పోటీ ఇలా పోటీతత్వం చాలా ఎక్కువగానే ఉంది. ఆ పోటీని తట్టుకుని నిలబడగలగాలి, వారిని దాటుకుని విజయ పతాకాన్ని అందుకోవాలి. అవతల వ్యక్తిని బట్టి మన స్పందన ఉండాలి. అన్ని వేళలా సర్దుబాటు తనం పనికిరాదు. ముఖ్యంగా రేసులో గెలుపొందాలి  అంటే అవతలి వ్యక్తిని ఓడించాల్సిందే. కానీ ఆ గెలుపులో నిజాయితీ ఉండాలి.  ఎదుటి వారి స్పందనను బట్టి మన ప్రతిస్పందన ఉండాలి. అవతలి వారు మనల్ని తొక్కేసినా సరే ముందుకు వెళ్లాలని అనుకున్నప్పుడు వారిని అధిగమించి, అవసరమైతే ఎదిరించి అయినా సరే మనం ముందుకు వెళ్లడంలో తప్పులేదు.
 
నోరులేని మేకల్ని బలి ఇస్తారు. కానీ, గర్జించే సింహాలను బలి ఇచ్చే సాహసం చేయరు. మీరు ఎప్పుడూ తల వంచుకుని, అన్నిటికీ సర్దుకు పోతూ మౌనంగా సాగిపోతే సరిపోదు కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టే ఎదుటి వారికి దీటైన సమాధానం చెప్పి ముందుకు సాగాల్సి ఉంటుంది. పోటీతత్వం మనలో ఉన్నప్పుడే సాధించాలనే మరింత ఎక్కువగా ఉంటుంది. తద్వారా అనతి కాలంలోనే విజయాన్ని సొంతం చేసుకోగలం. మనకంటూ ఒక లక్ష్యం ఉంటే సరిపోదు ఆ లక్ష్యాన్ని అందుకున్నప్పుడే పరిపూర్ణంగా మన ఆశ నెరవేరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: