'పెట్టుబడులను' ఎలా రాబట్టాలో తెలుసా ?

VAMSI
ఎవ్వరైనా ఈ ప్రపంచంలో ఎంతో కృషి, పట్టుదల మరియు కష్టం లేకుండా ఒక ఉన్నత స్థాయికి చేరడం వీలుకాదు. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఒక రూపాయి నుండి మొదలు పెట్టి బిలియనీర్లు అయిన వారున్నారు. వీరంతా కూడా ఓవర్ నైట్ లో కోటీశ్వరులు కాలేదు. అయితే కేవలం కృషి పట్టుదల ఉంటే సరిపోదు ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ పోతే అనుకున్నది సాధించగలుగుతారు. అయితే ఎటువంటి నియమాలను పాటిస్తే అభివృద్ధి చెందగలరో క్లోడ్ ఫేర్ వ్యవస్థాపకులు మిచెల్ జాట్లిన్ కింద వివరించారు. ఈమె ఒక గొప్ప క్రౌడ్ ఫండర్. నిధులను సమీకరించడంలో జాట్లిన్ అందెవేసిన చేయి. ఇందులో మనము పాటించాల్సిన మెళకువలను తన అనుభవం మేర వివరించే ప్రయత్నం చేశారు.
అయితే ఈమె చెబుతున్న ప్రకారం పెట్టుబడులను సేకరించడం అంత సులభం కాదంటున్నారు.  మిచెల్ మాములుగా తాను సొంతంగా వ్యాపారం చేయడానికి ముందుగా గూగుల్ మరియు తోషిబా లాంటి గొప్ప కంపెనీలతో కలిసి పనిచేశారు. ఇక్కడ వివిధ స్థాయిలలో తన సేవలను అందించారు. అంతే కాకుండా ఎంతో కొంత అనుభవాన్ని గడించారు. ఈ అనుభవం మిచెల్ కు ఎన్నో కొత్త కొత్త వాటిని కనుగొనడంలో సహాయపడింది ఇప్పటికీ చెబుతుంటారు. అయితే ఈమె నినాయాలు ఎపుడూ చాలా కరెక్టుగా తీసుకుంటుందని చెబుతూ ఉంటారు. దీనిని బట్టి వ్యాపారం చేయడానికి ముందుగా కొంత అనుభవం ఉండాల్సిందే అని అర్ధం అవుతోంది.
ప్రతి సంస్థలో మనకు సహాయకులు అవసరం అవుతారు. అయితే మనము ఎవరిని సెలెక్ట్ చేసుకుంటామనేది చాలా ప్రధానం. మిచెల్ మరియు తన కొలీగ్ ఇద్దరూ కలిసి ఎంతో మంచి టీం ను రూపొందించారట, కానీ అప్పటికే వారికి పరిశ్రమలలో చేసిన అనుభవం లేనందున... అలాంటి వారి కోసం వారు మళ్ళీ వెతకడం ప్రారంభించారు.  ఆ తరువాత అన్ని రకాల స్కిల్స్ కలిగి ఉన్న 2,000 మందితో టీం ను ఏర్పాటు చేసుకోగలిగాము. పెట్టుబడి పెట్టే వారితో ఏ విధంగా మాట్లాడాలి అనేది చాల ముఖ్యం. మొదటి సారి పెట్టుబడి పొందడానికి వెళ్లే సమయంలో వివరించే ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా పెట్టుబడి సంస్థ కంటే పెట్టుబడి పెట్టే వారికి ఎక్కువ విలువ ఇవ్వాలి. అయితే చాలా మంది వారితో ఎంతో అనుబంధంగా మెలిగే పెట్టుబడి భాగస్వాములను వదిలేసి, పెద్ద పెద్ద పెట్టుబడి సంస్థలు ఇచ్చే వాటి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎప్పుడైనా మనకు పెట్టుబడి పెట్టే వారిని ఎంతో గౌరవించాలి. అంతే కానీ పెట్టుబడి సంస్థలను కాదు అని గుర్తించుకోండి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: