విజయం మీదే: ఈ మూడు సూత్రాలతో విజయం మీ సొంతం ?

VAMSI
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఇతరులతో సానుకూలమైన సంబంధాన్ని కోరుకుంటారు. ఎవరు ఎవరితోనూ శత్రుత్వం కానీ, ద్వేషాన్ని కానీ కోరి తెచ్చుకోరు. అయితే సందర్భాన్ని బట్టి కొందరు మనకు విరోధులు గానూ, శత్రువుల గానూ మారుతుంటారు. మానవుల మధ్య సంబంధాలకు మానవులే ఎలా కారణమో అదే విధంగా వారి మధ్య ఆ సంబంధాలు అనుకూలమైనవి లేక వ్యతిరేకమైనవి కావడానికి కూడా పరోక్షంగానైనా లేక ప్రత్యక్షంగానైనా వారే కారణమవుతుంటారు. మన నడవడిక, వైఖరి మన సంబంధాల మధ్య వారదులు అవుతుంటాయి. కాబట్టి ఇతరులు నీతో ఎలా ఉండాలన్నది 90 శాతం వరకు మీపైనే ఆధారపడి ఉంటుంది అని విశ్లేషకులు చెబుతున్న మాట. మిగిలిన పది శాతం వారు మిమ్మల్ని చూసే కోణాన్ని బట్టి ఉంటుంది.
ముఖ్యంగా మూడు అంశాలను మీరు తప్పక పాటించినట్లయితే మానవ సంబంధాలను మంచిగా నిలబెట్టుకోవడమే కాదు. జీవితంలో ఎంతటి సమస్యనైనా  అధిగమించి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు.
సానుకూల వైఖరి: సమస్యలు ఎదురైనపుడు, మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ సమస్యను సానుకూలంగా పరిష్కరించడానికి మీ దగ్గర ఉన్నటువంటి మార్గాలను అన్వేషించాలి. ఎలా సమస్యను పెద్దది కాకుండా సర్దిపెట్టాలో అన్న విషయం గురించి ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఇలా చేయడం వలన తప్పక మీ సమస్య తీరడమే కాకుండా మానవ సంబంధాలు కూడా పదిలంగా ఉంటాయి.
ఓపిక :ఎంతటి కష్టమైనా సరే కంగారు పడి, నిరుత్సాహ పడిపోకూడదు. ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలి. సహనంగా ఉంటూ నిదానంగా నైనా సరే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి.
వ్యూహ రచన: సమస్య వచ్చినపుడు సతమతమవకుండా, ఇంకా చురుకుగా ఆలోచించగలగాలి. సమస్య పరిష్కరించడానికి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికను రచించాలి. సమస్య తీవ్రతను బట్టి వ్యూహరచన ఉండాలి.
ఈ మూడు సూత్రాలు పాటిస్తే ఎటువంటి సమస్య అయినా సరే సానుకూలంగానే పరిష్కరించుకో గలరు. అలాగే మీరు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: