విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

VAMSI
'కృషితో నాస్తి దుర్భిక్షిం' ఇది జగమెరిగిన సత్యం. ఎవరూ కాదనలేని వాస్తవం. శ్రద్ద పెట్టి లక్ష్యం కోసం శ్రమించాలే కాని సాధ్యం కానిది ఏదీ ఉండదు. కాకపోతే కష్టమైన దారిలో ముందుకు నడవడం కాస్త సమస్యాత్మకమే అవుతుంది. అయినా ఇష్టమైన వాటి కోసం కష్టపడటంలో తప్పు లేదు. అయితే చాలా మంది కాస్త సులువుగానే వారు అనుకున్నది సాధిస్తారు. కానీ మరి కొందరు మాత్రం 'గాలిలో దీపం పెట్టి దేవుడా' అని ఎదురుచూస్తుంటారు. 'గాలిలో దీపం' అనే సామెత అందరూ వినే ఉంటారు. ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రం కష్ట పడకుండా మనకు అదృష్టం వరిస్తుందిలే, అంతా ఆ పైవాడే చూసుకుంటారు అని నిమ్మకు నీరెత్తినట్టు ఉండి పోతారు.
అలాంటి వారికి స్వయంగా ప్రయత్నించాలని కానీ... కష్టపడి అయినా సాధించాలని కానీ అసలు అనుకోరు, ఆ ఆలోచననైనా దరి చేరనివ్వరు. అదృష్టం ఎప్పుడూ తమ వెంటే ఉంటుందని అంతా తమకు అనుకూలంగా జరుగుతుందని అనుకుంటుంటారు. కాని ఇది అన్ని వేళలా జరిగే పని కాదు. కష్టపడితే ఫలితం తప్పక ఉంటుంది అన్నది ఎంత నిజమో. అదృష్టం ఎప్పుడూ ఒకచోటే ఉండదన్నది అంతే నిజం. ఒకటి, రెండు సార్లు కలిసి వచ్చింది కదా అన్ని సార్లు అదే విధంగా జరుగుతుందని మీ ఆశయం నెరవేరుతుందని అనుకుంటే అది తప్పే.
ఒకవేళ ఆశించిన ఫలితం రాకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. నిరాశ చెందక తప్పదు. కాబట్టి అలాంటి అపోహలు వీడి ... అదృష్టం కోసం కాచుకు కూర్చోకుండా మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. మంచి ఫలితం అందుకోండి ఇక  అంతా విజయమే. అందుకని ముందుగానే అప్రమత్తంగా వ్యవహరించి మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. పట్టుదలతో ముందుకు సాగండి ఇక అంతా శుభమే. ఇకనైనా మారండి... అలసత్వం వీడండి విజయం కోసం విజయం వెంటే పరుగులు తీయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: