విజయం మీదే: ఇంత చిన్న విషయం తెలియక కొట్టుకు చస్తున్నారు ... ?

VAMSI
సమాజములో ఉన్న ప్రతి ఒక్కరికీ కొన్ని కోరికలు ఉండడం సహజమే. అంతే కాకుండా ఎలాగైనా ధనవంతులు అయిపోవాలి. సంతోషంగా బ్రతకాలి. మన జీవితంలో ఏ లోటూ ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. అయితే జీవితం అన్నది ఒక ప్రయోగశాల. నిత్యం ఏదోకటి నేర్చుకుంటూ ఉంటాము. కానీ కొంతమంది తమ జీవితంలో ఎన్ని సార్లు నేర్చుకున్నా ? తమ తీరులో మార్పు ఉండదు. అటువంటి వారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకుని ఆచరించడం చాలా మంచిదని మా అభిప్రాయం. పుట్టిన ప్రతి ఒక్కరూ గెలుపు కోసమే ఆరాటపడుతుంటారు. అది ఏ విషయంలోనైనా కావొచ్చు, వారు కేవలం గెలుపుని మాత్రమే ప్రేమిస్తారు చేస్తారు. సాధారణంగా అందరికీ గెలవాలని ఉంటుంది. కానీ అన్ని సమయాలలో మనమే గెలవలేమని గుర్తుంచుకోవాలి. అప్పుడప్పుడు ఓటమి మనల్ని తట్టి లేపుతూ ఉంటుంది.
 ఎందుకంటే ఎంతోమంది విజయం అనే గర్వం తలకెక్కి మనకిక తిరుగులేదు అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వీరు ఆనందంగా ఉంటారు. అలాగే ఓడిపోయిన వారు చాలా కృంగిపోతూ ఉంటారు. ఇక మన జీవితం అయిపోయింది అన్న భావన వారిలో ఉంటుంది. ఎందుకంటే వారు గెలవాలని ఎంత ప్రయత్నించినా ఏదో ఒక లోపం కారణంగా ఓటమి వారిని విడిచి వెళ్ళదు. ఇలాంటి వారు ఆనందంగా ఉండలేరు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వారిలాగా బాధగా కనిపిస్తారు. వీరిద్దరి తీరులో ఎలాంటి మార్పు ఉండదు. గెలుపు మరియు ఓటమిల గురించి ఆలోచించడానికే వారి జీవితం సరిపోతుంది.
కానీ కొంతమంది అటు గెలుపును మరియు ఓటమిని సమానంగా ట్రీట్ చేస్తారు. అంటే గెలిచినప్పుడు ఓవర్ గా సంతోషపడడం కానీ లేదా ఓటమి చెందినప్పుడు తీవ్రంగా కృంగిపోవడం కానీ చెయ్యరు. ఎందుకంటే ఈ గెలుపు మరియు ఓటమి ఎప్పుడూ శాశ్వతం కాదని వారికి తెలుసు. కాబట్టి నిత్యం సంతోషంగా సుఖంగా తమ జీవితాన్ని గడుపుతో ఉంటారు. ఇంత చిన్న విషయం తెలియక బయట చాలా మంది కొట్టుకు చేస్తుంటారు. అలాంటి వారంతా ఈ ఆర్టికల్ చదివి ఆనందంగా ఉండగలరు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: