విజయం మీదే: మీ మనసు తరచూ డిస్టర్బ్ అవుతోందా ?

VAMSI
మనకు నచ్చని విషయాలు జీవితంలో ఎదురైనప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో మనమే చేయాల్సినప్పుడు మనం చాలా డిస్టర్బ్ అవుతాం. అయితే ఈ డిస్టబెన్స్ అనేది సమస్యపై ఆధారపడి ఉంటుంది. ఆ సమస్య చిన్నది అయితే పర్వాలేదు కానీ, మన మనసు తొలిచేంత పెద్దది అయితే మాత్రం చాలా ఎక్కువగా డిస్టర్బ్ అవుతాము. అది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. తద్వారా లేనిపోని భయాలు, మనసులో మరింత బాధ పెట్టే ఆలోచనలు వస్తాయి. ఈ టెన్షన్ లో ఎమీ పాలుపోదు అంతా గందరగోలంగనూ అస్థిరంగా అనిపిస్తుంది. ఎంత మందిలో ఉన్నా ఒంటరిగా ఫీల్ అవ్వడం, ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడటం, కనీసం మన వారితో సంతోషంగా మాట్లాడలేక పోవడం ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి.

ఈ మానసిక ఆందోళన తారా స్థాయికి చేరుకుంటే డిప్రెషన్ లోకి వెళ్లి పోయే అవకాశం కూడా ఉంది. అది ఎంత ప్రమాదం అన్నది అందరికి తెలిసిందే. అయితే ఇలా జరగకుండా మొదట్లోనే మీరు ఏదో ఒక విషయంలో డిస్టర్బ్ అయినప్పుడే మానసిక ఒత్తిడికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మీరు తక్కువ సమయంలోనే ఈ గందరగోళ పరిస్థితి నుండి బయట పడవచ్చు. మెంటల్ గా టెన్షన్ పెరగకుండా ఆదిలోనే అరికట్టవచ్చు.  ఎప్పుడైతే  మీకు నచ్చిన పని లేదా, ఏదైనా సమస్య కారణంగా మీరు డిస్టర్బ్ అవుతారో, వెంటనే ఆ అంశం గురించి మీ స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ షేర్ చేసుకోవాలి.

అప్పుడు మీ మనసులోని భారం కొంతలో కొంత తగ్గి కాస్త తేలిక పడుతుంది. లేదంటే మీరు అలా డిస్టర్బ్ అయిన వెంటనే మీకు నచ్చే చోటుకు వెళ్లడం లేదా నచ్చే పనులు చేయడం, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడటం ద్వారా కొంచెం ఆ  మూడ్  (పరిస్థితి) నుండి డైవర్ట్ కావచ్చు. లేదా ఆ విషయం గురించి పదేపదే ఆలోచించకుండా ఏదో ఒక పనిలో బిజీగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇలా కొన్ని రకాల పనులు చేయడం వలన మీ మనసును ఇబ్బందికర పరిస్థితి నుండి బయటపడేలా చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: