ఇండియా హెరాల్డ్ కుటుంబ స‌భ్యుల‌కు `కోటి కానుక‌`

VUYYURU SUBHASH
ఇండియా హెరాల్డ్ సంస్థ అధినేత‌, ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌ టెక్ దిగ్గ‌జం.. కోటి గ్రూప్ ఆఫ్ వెంచెర్స్ అధినేత స‌రిప‌ల్లి కోటిరెడ్డి స్ట‌యిలే డిఫ‌రెంట్‌. త‌న సంస్థ‌లో ప‌నిచేసే వారితో ఆయ‌న అనుబంధ‌మే డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని ఉద్యోగులు చెబుతారు. ఆయ‌న ఎప్పుడూ.. త‌న సంస్థ‌లో ప‌నిచేసే వారిని ఉద్యోగులుగా కాకుండా.. వ‌సుధైక కుటుంబంగా భావిస్తారు. ప్ర‌తి ఒక్క‌రినీ గౌర‌వించ‌డంతోపాటు.. కేవలం వారి ప‌నికి విలువ క‌ట్ట‌డం కాకుండా.. వారి క‌ష్ట‌సుఖాల్లోనూ ఆయ‌న పాలు పంచుకుంటారు.

ఈ క్ర‌మంలోనే ఉద్యోగుల‌ను సొంత కుటుంబ స‌భ్యులుగా భావిస్తారు.. కోటిరెడ్డి. నిజానికి ఇప్పుడున్న మీడియా ప్ర‌పంచంలో ప‌నిచేయించుకోవ‌డ‌మే త‌ప్ప‌.. జ‌ర్న‌లిస్టుల‌ను, ఫ్రీలాన్స్ రైట‌ర్ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకునే రోజులు లేవు. ప‌నిచేయించుకోవ‌డమే త‌ప్ప‌.. ఉద్యోగుల సాధ‌క బాధ‌లు, వారి క‌ష్ట‌సుఖాలు.. చూసే సంస్థ‌లు బూత‌ద్దం ప‌ట్టుకుని వెతికినా.. క‌నిపించ‌ని ప‌రిస్థితి ఉంది. ఈ స‌మ‌యంలో హెరాల్డ్ అధినేత కోటిరెడ్డి.. మాత్రం త‌న సంస్థ‌లో ప‌నిచేసే ఆథ‌ర్స్ స‌హా.. అంద‌రినీ కుటుంబంగా చూసుకోవ‌డం రికార్డే. స‌హ‌జంగానే ఎంత పెద్ద మీడియా సంస్థ‌లో అయినా, ప్ర‌భుత్వ ఉద్యోగం అయినా 1వ తారీఖుకు కాని జీతం అక్కౌంట్ల‌లో ప‌డ‌దు.

హెరాల్డ్ గ్రూపు సంస్థ‌ల్లో మాత్రం ప్ర‌తి నెలా 25వ తేదీకే అక్కౌంట్ల‌లో క్రెడిట్ అవుతుంది. తెలుగువెబ్ జ‌ర్న‌లిజం చ‌రిత్ర‌లో ఇలా ఎవ‌రూ చేయ‌లేద‌నే ఘంటా ప‌థంగా చెప్పుకోవ‌చ్చు. ఆథ‌ర్స్ ఇంట్లో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు, వారి వివాహాల‌కు కూడా కోటిరెడ్డి చేతికి ఎముక‌లేని దాత మాదిరిగా సాయం చేస్తుంటారు. సంస్థ‌లో ప‌నిచేసే వారు ఎవ‌రు వివాహం చేసుకున్నా.. ఆయ‌న వేలాది రూపాయ‌ల‌ను గిఫ్ట్‌గా ఇస్తారు. వారికి తాను చేసే సాయంతోనే ఆశీర్వ‌దిస్తారు.

పోర్ట‌ల్లో ప‌నిచేసే ఆథ‌ర్స్‌లో ఎవ‌రి వివాహానికి అయినా రు. 3,116 నుంచి రు, 10 వ‌ర‌కు కోటి కానుక అందించ‌డం కోటిరెడ్డికే చెల్లింది. సంస్థ ప‌ట్ల కొన్నేళ్లుగా అంకిత‌భావంతో ప‌నిచేస్తోన్న ఒక మ‌హిళా ఫ్రీలాన్స్‌ ఆథ‌ర్ వివాహానికి ఆయ‌న ఏకంగా ప‌దివేల నూట‌ప‌ద‌హారు రూపాయ‌లు అందించి ఆథ‌ర్స్‌పై త‌న‌కున్న అపార ప్రేమ చాటుకున్నారు. ఏదేమైనా కోటి కానుక పేరుతో ప్ర‌తి ఉద్యోగి కుటుంబానికి కోటిరెడ్డి ఎంతో అండ‌గా నిలుస్తున్నార‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: