విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

VAMSI
చాలా మంది తమ జీవితంలో ఏదో గుర్తింపు కావాలని, పది మంది ముందు గొప్పగా బతకాలని తహతహలాడుతుంటారు. ఆర్థికంగా బాగుండాలని,  జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండకూడదని కోరుకుంటూ ఆ భాగ్యం తమకు లేదని బాధపడుతుంటారు. అయితే సంపదలు, ధనధాన్యాలు ఇలా అనుకోగానే అలా ప్రత్యక్షమయ్యేవి కాదు. అందుకు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది.  ఎంతగానో శ్రమించి  సంపాదించాల్సి ఉంటుంది. అయినా ఇవన్నీ ఒక్క రోజులోనో  ఒక నెలలోనో దక్కేవి కావు. ఇందుకు ఒక చక్కటి ప్రణాళిక అవసరం. ఉదాహరణకు.. మీరు ఒక వ్యాపారం ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని అనుకుంటే, చేయబోయే వ్యాపారం ఎత్తు పల్లాలు అన్నింటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

ప్రస్తుతం ఆ వ్యాపారం చేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి.  వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో శ్రమిస్తే కానీ అనుకున్న స్థాయికి చేరుకోలేరు. ఆ విధంగా మీరు అనుకున్న దానిపై లేదా స్థిరపడాలనుకున్న రంగంలో గట్టిగా ప్రయత్నం చేయాలి. ఈ మధ్యలో ఎన్నో కస్టాలు కలగొచ్చు. అడ్డంకులు ఎదురు కావొచ్చు. వాటికీ మీరు భయపడి వెనక్కు తగ్గకుండా ఉండాలి. ఇలా మీరు కోరుకున్న రంగంలో డబ్బులు సంపాదిస్తారు. అలాగని డబ్బే జీవితం కాదు. ఆర్థికంగా బాగుంటేనే అందరూ గౌరవిస్తారు అనుకోవడం అమాయకత్వం.

మన  సత్ప్రవర్తన మనం చేసే మంచి పనులే ఈ సమాజం ముందు మనల్ని గొప్ప వాళ్ళుగా మారుస్తాయి.  ఈ సమాజంలో గొప్పగా బ్రతకాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ గొప్పతనం డబ్బుతోనే వస్తుందనుకోవడం పొరపాటు. కాబట్టి ఉన్న జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి  ప్రయత్నించడం ఉత్తమం. అలా కాకుండా మనకు ఏమీ లేదని బాధపడుతూ ఇతరులతో పోల్చుకుని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. అలా ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ఏమీ సాధించలేరు. ఈ విషయాలన్నీ గ్రహించి ముందుకు సాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: