విజయం మీదే: మీరు ఇంటర్వ్యూ కి వెళుతున్నారా ఇవి తెలుసుకోండి ?
అవేంటో ఇప్పుడు చూద్దాం.
* ఇంటర్వ్యూ డేట్ కంటే ముందు మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోవాలి.
* ముందుగా మీ సర్టిఫికెట్స్ ను అవసరమైన డాక్యుమెంట్స్ ను, రెజ్యూమ్ ను ఇలా అన్నిటినీ ఒక క్రమ పద్దతిలో ఉంచుకోవాలి.
* మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళే కంపెనీ గురించి ముందుగా అన్ని విషయాలను తెలుసుకోవడం మంచిది.
* ఇంటర్వ్యూ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేది మీరు ఎంచుకున్న ఉద్యోగాన్ని బట్టి ఎంతో కొంత మీకు అవగాహన ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించిన విషయాలను ముందుగా ప్రాక్టీస్ చేయడం మంచిది.
*ఇంటర్వ్యూ కి వెళ్లేముందు మీ అప్పీయరెన్స్ బాగుండేలా చూసుకోవాలి. అంటే మీ హైర్ కట్, డ్రెస్సింగ్ స్టైల్ ను చక్కగా ఉండేలా చూసుకోండి.
*ఇంటర్వ్యూ లో మీరు మాట్లాడేటప్పుడు నేరుగా అవతలివారి కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి. దిక్కులు చూడకూడదు.
* అదే విధంగా మీ మాటలు స్పష్టంగానూ సూటిగానూ ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
* ఇంటర్వ్యూ ముందు రోజు చక్కగా టైం కి నిద్రపోవాలి. అప్పుడే మీరు ఫ్రెష్ గా ఉంటారు.
* ఇంటర్వ్యూ సమయానికంటే పదినిమిషాల ముందే మీరు చేరుకోవాలి, లేట్ గా వెళ్ళరాదు.
* మీరు ఆ ఉద్యోగానికి సమర్థులు అన్న ఉద్దేశ్యాన్ని ఎదుటివారికి అనిపించేలా మీ సమాధానాలు చక్కగా ఉండాలి.
ఇలా చేసినట్లయితే మొదటి ఇంటర్వ్యూ లోనే మీకు ఉద్యోగం వస్తుంది...!