విజయం మీదే: విలువలే మీ ఆస్తి అంతస్తు ...

VAMSI

మనిషి జీవితంలో అభివృద్ధి చెందాలని పరుగులు తీస్తుంటాడు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉంటుంది. ప్రస్తుతం ఉన్న తరంలో ఆస్తిపాస్తులు సంపాదించడమే ప్రధాన కర్తవ్యంగా చాలా మంది ఉరకలు పరుగులు తీస్తున్నారు. అయితే ఇక్కడే మనం సరిగ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ దారిలో మనం అనుకున్నది సాధించాలో తెలుసుకోవాల్సి ఉంది. ఏ విధంగా మనం కోరుకున్న స్థాయికి ఎదగాలి, ఏ మార్గం లో మనం కోరుకున్న జీవితాన్ని కొనసాగించాలి అన్న అంశాన్ని సరిగ్గా నిర్ణయించుకోగలగాలి. ఈ క్రమంలో ప్రతి నిమిషం ఎంతో భాద్యతగా వ్యవహరించాలి. అంతే తప్ప మనం ఎదగడం కోసం అడ్డదారులు తొక్కకూడదు . అదే విధంగా ఎవ్వరికీ ఎటువంటి చెడు చేయకూడదు.

మనం కోరుకున్న తీరానికి చేరడం ముఖ్యమే. కానీ ఆ దారి ఎలా ఉందనేది ప్రధానం. మన వలన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదు. ప్రస్తుతం మనం జీవిస్తున్న సమాజంలో డబ్బు ఉంటేనే గౌరవం దక్కుతుంది అన్న భావన అందరిలోనూ పాతుకుపోయింది. కానీ సంపదకు మించిన  విలువైన ఆస్థి మన విలువలే అని తెలుసుకోవాలి. ఒక మనిషి మంచి గుణగణాలతో పాటు ఎదుటి వారిని కష్టాల్లో చూసినప్పుడు చలించే మనసును కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన బుద్ధి సరైన మార్గంలో తప్పొప్పులను యెరిగి మంచి వైపు నిలబడుతుందో, ఎప్పుడైతే ఆత్మ విశ్వాసంతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, సరైన నిజాయితీ అనే మార్గంలోనే  ముందుకు వెళతామో, అది మనం పొందే అసలైన సంపద మరియు ఆస్తి. అది తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. కానీ అది ఎంతో విలువైందే అవుతుంది.

మన చుట్టూ ఉన్న సమాజంలో జీవించడానికి సంపాదన ఎంతైతే అవసరమో, మంచి మార్గంలో అందరూ హర్షించే దారిలో నడవటం అంతకన్నా ముఖ్యం. మనం  ఎదగాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అందుకోసం నిజాయితీతో కూడిన మార్గాన్ని ఎంచుకోవాలి. ఇలాంటి దారిలో మన గమ్యాన్ని చేరుకోవడం కాస్త ఆలస్యం కావచ్చు. కానీ ఇందులో ఉన్న ఆనందం కొలవలేనిది. మన వెనుక ధనం ఉంటేనే గౌరవిస్తారు అనుకోవడం నిజం కాదు. మనం నీతి నిజాయితీగా ఉంటే  అంతకు మించిన గౌరవాన్ని పరపతిని ఈ సమాజంలో  అందుకోవచ్చు. నిజాయితీకి మించిన సంపద లేదు. మంచితనానికి మించిన  గొప్పతనం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: