విజయం మీదే: విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకో...?

VAMSI
జీవితంలో విద్య చాలా విలువైనది. వాస్తవానికి దేశం యొక్క అభివృద్ధి ఎక్కువగా విద్య పైనే ఆధార పడి ఉంటుంది. ఎక్కడైతే విద్యా శాతం ఎక్కువగా ఉంటే ఆ దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నది అన్నది అక్షర సత్యం. విద్య అనగా బోధన, నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యాసనల సమీకరణం. విద్య ఓ వైపు మన సంస్కృతిని ఆచార వ్యవహారాలను తదుపరి తరాల వారికి అందిస్తూనే... మరో వైపు టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. 
ప్రాచీన కాలంలో, పర్ణ శాలలు, కుటీరాలు, ఋషుల ఆశ్రమాలు,  విద్యాభ్యాసం కొరకు కేంద్రాలుగా ఉండేవి. మారుతున్న కాలంతో పాటు విద్యా కేంద్రాలు కూడా మారాయి. 

కానీ  విద్య యొక్క ఉద్దేశ్యం మారలేదు.. పౌరులను ఎంత గానో ప్రభావితం చేస్తూ... వారిని సర్వ విద్యావంతులుగా సమర్థవంతులుగా ఈ ప్రపంచానికి అందిస్తోంది. అయితే అప్పటికి ఇప్పటికి.. విద్య పరంగా ఓ విషయం మారిందనే చెప్పాలి. అప్పట్లో విజ్ణాన సముపార్జన కోసం విద్యను అభ్యసించేవారు. కానీ ప్రస్తుత కాలంలో విద్యా రంగం ఒక వ్యాపారంగా మారింది. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం... వారి జీవితంలో ఉన్నత స్థాయికి చేరడం కోసం విద్యను అభ్యసిస్తున్నారు. ఏదేమైనా కాలాన్ని బట్టి మారక తప్పదు కదా. అయితే తల్లిదండ్రులు విద్య పేరుతో పిల్లలపై ఎక్కువ మానసిక ఒత్తిడి తీసుకు రాకూడదు. 

ప్రశాంతమైన వాతావరణంలో, వారి ఇష్ట ప్రకారం విద్యావంతులు అయ్యేలా మార్గదర్శకం చేయాలి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు విద్యను అందించాలి. అప్పుడే వారు సంతోషంతో మరింత సమర్థవంతంగా నేర్చుకోగలరు. విద్య అంటే కేవలం పుస్తకాలే కాదు... అదనపు పాఠ్య ప్రణాళిక కార్యకలాపాలు... అనగా ఆటలు, పాటలు, కళలు మరియు వ్యాయామం మొదలగునవి. ఇవి కూడా విద్యలో ఒక భాగమే... వీటితో పాటు విద్యను అందించడం ద్వారా పిల్లలు మరింత విజ్ఞానవంతులుగా తయారవుతారు. కాబట్టి విద్యను బేఖాతరు చెయ్యొద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: