విజయం మీదే: నిజమైన అదృష్టవంతులా ? కాదా ?

VAMSI
జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా,సౌకర్యవంతంగా బ్రతకాలని ఆశిస్తారు. అలా బ్రతకాలంటే భాగ్యవంతులై ఉండాలని ఆ దేవుడి యొక్క చల్లని చూపు తమపై ఉండాలని కోరుకుంటారు. అయితే ఇంతకీ అసలైన భాగ్యం అంటే ఏమిటి...? భాగ్యం అంటే అందరూ... సంపద, ఆభరణాలు మాత్రమే అనుకుంటారు. కానీ ఇవి మాత్రమే భాగ్యం కావు ..గొప్పతనం, ఎదుటివారికి సాయం చేసే గుణం, గొప్పతనం, దివ్యత్వం ఇవన్నీ కూడా భాగ్యమే అవుతాయి. మనం ఆశించకపోయినప్పటికి మనకు లభించిన ఆనందాన్ని ఇచ్చేవన్నీ భాగ్యం అనే చెప్పాలి. మనం నమ్మి పూజించేది ఆ భగవంతుడినే.. ‘భగవంతుడు’ అనే పదానికి ‘భాగ్యాలను ఒసగేవాడు’ అనే అర్థం ఉంది.
ఆయన అవతరించినదీ భాగ్యాలను ఇవ్వడానికే అని భాగవతంలో చెప్పబడింది. మన మానవ జన్మ ఒక భాగ్యం. అందులోనూ ఎటువంటి అవ లక్షణం లేకుండా పుట్టడం మనము చేసుకున్న పుణ్యఫలం అని పెద్దలు చెబుతుంటారు. మనం చేసే ప్రతి పని దాని కర్మ ఫలితాన్ని ఇస్తుంది. ఆ కర్మ మనకు ఎంత భాగ్యాన్ని ఇవ్వాలో నిర్ణయిస్తుంది. అందుకే మానవుడు తాను చేసే ప్రతి చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, మంచి, చెడు ఎరిగి వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడే మనము చేసే ప్రతి పని కూడా సక్రమముగా జరుగుతుంది. ఇలా మీ జీవితంలో మీరు ఒక మంచి జన్మను పొందడం ద్వారా ఆ దేవుడి మీకు అదృష్టాన్ని కలిగించడనై మీరు సంతోష పడండి.
ఈ లోకంలో మన లాగా కాకుండా ఎంతో మంది అంగ వైకల్యంతో జీవిస్తున్నారు. అలాంటి వారు ఏమనుకోవాలి. వారు ఎప్పుడూ వారికి దక్కిన జన్మ గురించి చింతించరు. కానీ అన్నీ ఉన్న కొంత మంది మానవులు మాత్రం లేని మరియు రాని వాటి కోసం వృధా ప్రయాస పడుతుంటారు. ఇలా చేయడం వలన మీకు ఎటువంటి లాభం ఉండబోదని మీరు గ్రహించాలి. జీవితంలో ఎప్పుడు కూడా దొరికే దానితో సంతోషపడాలి. అప్పుడే దేవుని చల్లని చూపు మీపై ఉంటుంది. త్వదారా ఈ లోకంలో మీకన్నా మించిన అదృష్టవంతుడు ఎవరూ ఉండరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: