విజయం మీదే: మూఢ నమ్మకాలకు దూరంగా ఉండండి...?

VAMSI
కొందరి జీవితాల్లో మూఢనమ్మకాలు  ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు ఇటువంటి వాటిని ఆచరించడం వలన తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. మూఢనమ్మకాలకు ఒక సత్యమైన రూపం ఉండదు... గుడ్డిగా నమ్ముతూ ఎంత కఠినమైనా సరే ఆచరిస్తూ పోతుంటారు. శాస్త్రీయంగా నిరూపణ కాని వాటిని మూఢ నమ్మకాలు అంటారు. మూఢనమ్మకాలు రక రకాలుగా ఉంటాయి... కొన్ని మన జీవితంలో కలిగే ఒత్తిడి వలన వాటికి పరిష్కారం వెతికే సమయంలో కొందరు మూఢనమ్మకాల బాట పడుతుంటారు. ఉదాహరణకు మన జీవితంలో కొన్ని ముఖ్య కార్యాలు జరగడానికి కొన్ని మూగజీవాలను బలి ఇవ్వడం... చేతబడి ఇలాంటివి కూడా మూఢనమ్మకాల కిందకే వస్తాయి.

పిల్లలకు వచ్చిన కోరింత దగ్గుకు కుక్కను వేలాడ దీసిన కానుగ చెట్టుకున్న కానక్కాయను తెచ్చి దానికి మధ్యలో రంధ్రం చేసి పిల్లవాని మొల త్రాడుకు కడతారు. తల్లి దండ్రులు చనిపోయిన సంవత్సరంలోపే యుక్తవయసుపిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యాలి, లేదా మూడేళ్ళు అగాలి. కాలం ఎంతగా పరిణితి చెందుతున్నప్పటికీ ఇంకా ఇలాంటివి ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. సతీసహగమనం, బాణామతి, అంటరానితనం...ఇవన్నీ మూఢనమ్మకాల వల్ల పుట్టిన దురాచారాలే. వాస్తవానికి మూఢనమ్మకాలు అనేవి కేవలం కల్పితాలు మాత్రమే. వీటిలో ఎటువంటి సత్యము ఉండదు.

వీటిని నమ్మి పాటించడం ద్వారా మనం నష్టపోవడం లేదా మన వల్ల ఇతరులు నష్టపోవడం తప్ప మరి ఏమి ప్రయోజనం ఉండదు. ఇది అక్షర సత్యం... మంత్రాలకు చింతకాయలు రాలవు... అదేవిధంగా మూఢనమ్మకాలు కూడా అంతే... వీటిని నమ్మి గుడ్డిగా ఆచరించడం వలన సమయం వృధా అవుతుందే తప్ప... మరే ఉపయోగం ఉండదు. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా కూడా ఇలాంటివి ఎక్కడో ఒక మూల జరుగుతూనే ఉన్నట్లు మనము న్యూస్ లోనూ, వార్తా పత్రికలలోనూ చూస్తూనే ఉన్నాము. మీమధ్య కనుక ఇలాంటివి జరిగితే మీరు వెంటనే వీటిని ఆపండి. తద్వారా సమాజానికి ఎంతో ఉపయోగపడినవారవుతారు...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: