చింతించకండి....విజయాన్ని ఇలా సులభంగా పొందండి...?

VAMSI
ప్రతి మనిషికి జీవితం అనేది వడ్డించిన విస్తరికాదు. ఎవ్వరికీ జీవితం అంతా సుఖంగా ఉండదు. కష్టాలు ఉంటేనే సుఖం వస్తుంది. ప్రతిఒక్కరూ విజయానికి తగిన వెల చెల్లించక తప్పదు. ఎవరికీ సులభముగా విజయం రాదు, ఒకవేళ ఊరకనే విజయం వస్తే అది ఎన్నాళ్ళో ఉండదు. అట్టి విజయాన్ని నిలుపుకునే శక్తి మీలో ఉండదు. అలాంటి విజయాన్ని మీరు కూడా మర్యాదగా చూడరు. అందుకే కష్టంతో వచ్చిన విజయానికి మంచి విలువ ఉంటుంది. విజయాన్ని సాధించేవారు ఆకాశంనుండి ఊడిపడరు. మనలోనే మనతోనే తిరుగుతుంటారు, కానీ వారి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. వారి భావాలూ మంచి పంటలవైపు కేంద్రీకరించబడిఉంటాయి. వారికి విజయం ఎలా సాధించాలో తెలుసు. తరువాత ఆ విజయాన్ని ఎలా నిలబెట్టుకోవాలి కూడా బాగా తెలుసు. కొంతమంది విజయ గర్వంతో ఎగిసెగిసి పడుతుంటారు. కానీ వీరికి ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసు. వీరు నిరంతరం విజయం కొరకు ప్రయత్నిస్తూనే ఉంటారు.  విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంటారు.

ఎవ్వరికీ తొలి ప్రయత్నంలోనే విజయం దక్కదు. అది ఒక గెలుపోటముల సమ్మేళనం. మనం ఓటమి చెందామంటే అర్ధం మన కోసం విజయం ఎదురుచూస్తున్నదని గ్రహించాలి. ఓటమిలోనూ అది తీసుకువచ్చే నిరాశలోనూ గొప్ప అవకాశం దాగి ఉన్నదని తెలుసుకోవాలి. ఓటమి అనే నివురు లోపల విజయం అన్న నిప్పుకణిక దాగి ఉంది. కొంతమంది అపజయానికి కారణం తెలుసుకుంటారు. దాని మీద దృష్టి కేంద్రీకరిస్తూ అపజయానికి కారణం అయిన పనిని తిరిగి చెయ్యరు. అయినా దృష్టిని మళ్ళించి ఆపైన ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే విజయానికి మార్గం సుగమం ఔతుంది. విజయం అహ్వానం కూడా పలుకుతుంది. అదృష్టం కొరకు వెతుకుతూ కాలయాపన చేస్తే అది మీ వద్దకు ఎన్నటికీ రాదు. ప్రయత్నమే అదృష్టానికి ఆహ్వానం.

అవకాశాలన్నీ దేవుడు మీ కొరకు ఇచ్చినవే. వాటిని మీరందుకోకపోతే మరొకరు అందుకోవడం ఖాయం. విరుద్ధ భావాలు అవకాశాలను తన్ని వేస్తాయి. లేదా ఉపేక్షించేలా చేస్తాయి. ప్రారంభించి ఆపివేసిన పనులను పూర్తిచేయండి. పూర్తి అయిన తరువాత మీకు కలిగే భావాన్ని గమనించండి. ఆఖరుగా ఒక విషయాన్ని గమనించండి విజయం అనేది గుప్త " రహస్యం" కాదు. ప్రాథమిక సూత్రాలను పట్టువదలకుండా పనిచేస్తే ఫలితం కూడా అంతే. కొన్ని తప్పులు వరుసగా చేయడం వలన కలిగే ఫలితం " ఓటమి". కాబట్టి పై విషయాలను మనసున ఉంచి విలయానికి దగ్గరవుతారని ఆశిస్తున్నాము. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: