విజయం మీదే : ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే ఆర్థికపరమైన విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

మనలో ప్రతి ఒక్కరూ కెరీర్ లో సక్సెస్ కోసం శ్రమిస్తారు. ఆ సక్సెస్ సాధించిన తరువాత కొందరు ఆర్థికంగా సక్సెస్ అయితే మరికొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు. మన అలవాట్లను బట్టే మనం ఆర్థికంగా సక్సెస్ కాగలమో లేదో తెలుస్తుంది. ఆర్థికంగా ఎదగాలంటే సమయం మించిపోయేలోగా ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. అలా సరిద్దుకోకపోతే కెరీర్ లో సక్సెస్ సాధించినా ఆర్థికంగా సక్సెస్ కాలేం. మనం సాధారణంగా చేసే చిన్న చిన్న తప్పులను గుర్తించి సరిదిద్దుకుంటే ఆర్థికంగా సక్సెస్ కావడం కష్టం కాదు. 
 
మనం వినియోగించే ఎన్నో సేవలలో ప్రతిదానికి ప్రత్యేకమైన బిల్లింగ్ తేదీ ఉంటుంది. వాటిని ఆలస్యంగా చెల్లించి అపరాధ రుసుములు కట్టడం కంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రతి నెలా ఆటోమేటిక్ గా చెల్లింపులు జరిగేలా చూడాలి. బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే సక్రమంగా వాయిదాలను చెల్లించాలి. క్రెడిట్ కార్డ్ ఉంటే దానికి సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు సక్రమంగా చెల్లించాలి. 
 
జీతం చేతికి రాగానే మొదట పొదుపు గురించి ఆలోచించాలి. ఆర్థిక ప్రణాళికలో ఇది చాలా ముఖ్యం. చాలామంది బీమా విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. కానీ ఊహించని సమస్యలు ఎదురైతే బీమా ఆదుకుంటుంది. చాలామంది కొంత పన్ను ఆదా చేయడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. పన్ను ప్రణాళిక విషయంలో ఎప్పుడూ క్రియాశీలకంగానే ఉండాలి. 
 
రోజురోజుకు వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. అందువల్ల కుటుంబం మొత్తానికి ఉపయోగపడేలా ఫ్యామిలీ బీమా పాలసీని తీసుకోవడం మంచిది. అనవసర ఖర్చులను గుర్తిస్తూ వీలైనంత వరకు వాటిని తగ్గించుకుంటే పొదుపు మొత్తాన్ని సులభంగా పెంచుకోవచ్చు. ప్రస్తుత కాలంలో యువత పదవీ విరమణ తరువాత పరిస్థితుల గురించి ఆలోచించడం లేదు. ఇప్పటినుంచి పొదుపు చేస్తే పదవీ విరమణ సమయానికి కోట్ల రూపాయలు మన చేతిలో ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: