విజయం మీదే : గెలుపు విలువను గ్రహిస్తే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

జీవితంలో ప్రతి ఒక్కరికీ సక్సెస్ ఎంతో అవసరం. ఆ సక్సెస్ ఎంత త్వరగా లభిస్తే కెరీర్ లో అంత త్వరగా పైకి ఎదగగలుగుతాం. అలా కాకుండా తాత్కాలిక ఆనందాల కొరకు విలువైన సమయాన్ని వృథా చేసుకుంటే మాత్రం జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరికీ అవకాశాలు అనేవి అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మాత్రమే సక్సెస్ ను సాధించడం సాధ్యమవుతుంది. 
 
మనలో చాలామందికి సక్సెస్ సాధించే సత్తా ఉంటుంది. కానీ ఆ సక్సెస్ పొందలేకపోవడానికి వాళ్ల అలవాట్లు, లక్ష్యం కోసం శ్రమించిన విధానం, ఇతరత్రా వ్యాపకాలు కారణమవుతాయి. బద్ధకం, నిర్లక్ష్యం లాంటి లక్షణాలు విజయాన్ని మనకు అంతకంతకూ దూరం చేస్తాయి. జీవితంలో లక్ష్యం కోసం శ్రమించే ముందు గెలుపు విలువను గ్రహించాలి. మన జీవితంలో లక్ష్యాన్ని సాధిస్తే ఏం జరుగుతుందో సాధించకపోతే ఏం జరుగుతుందో గుర్తించాలి. 
 
సక్సెస్ సాధిస్తే నెత్తిన పెట్టుకునే ఈ సమాజం ఫెయిల్యూర్ అయిన వాళ్లకు మాత్రం పట్టించుకోదు. జీవితంలో విజయం సాధించలేక సమయాన్ని వృథా చేసుకున్న వాళ్లు తరువాత కాలంలో బాధ పడాల్సి వస్తుంది. అందువల్ల జీవితంలో లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలి. ఎవరైతే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రమిస్తారో వాళ్లు సులభంగా సక్సెస్ సాధించగలరు. లక్ష్యాన్ని సాధించాలంటే మొదట దానికోసం సరైన ప్రణాళికను రూపొందించుకోవాలి. 
 
ఆ ప్రణాళికకు తగిన విధంగా నిరంతరం శ్రమించాలి. సమాజంలో రోజురోజుకు పోటీతత్వం పెరుగుతోంది. ఆ పోటీని తట్టుకుని తెలివితో శ్రమిస్తూ విజయం కోసం కష్టపడాలి. మొదట్లో ఇబ్బందులు ఎదురైనా బంగారం లాంటి భవిష్యత్తు కోసం శ్రమిస్తే విజయం తప్పక సొంతమవుతుంది. మొదట్లో ఓటములు ఎదురైనా కష్టపడిన వారికి ఆలస్యంగానైనా విజయం తప్పక సొంతమవుతుంది.                         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: