అమ్మ: భగవంతుడు ఇచ్చిన గొప్ప బహుమతి అమ్మే.....

Suma Kallamadi

అమ్మ అనే పదం పలికితేనే మనసు హాయిగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దెబ్బ తగిలిన, కింద పడిన అమ్మ అంటారు కదా అందరం బహుశా ప్రతీ కష్టం లో ఆమె ఉంటుందన్న భరోసా వల్లనే ఏమో ఆలా అంటాం. నిజానికి అమ్మ లేక పోతే జీవితం లేదు. జన్మించిన  తర్వాత కూడా ఆమె లేక పోతే ఈమె రాదు, ఉండదు.

 

 

అయితే అమ్మ నిత్యం ప్రతీ దానిలో ఆమె భాగం అయ్యి మనల్ని నడిపిస్తుంది. విజయం పొందడానికి అయినా, ఓటమి దరి చేరకుండా ఉండడానికి అయినా సరే అమ్మ అండ మన వద్ద ఉండాల్సిందే. చిన్నప్పుడు అంతా చెప్పినట్టు విని, పెద్ద అయ్యాక ఆమెని ఆదర్శంగా తీసుకుంటే స్త్రీ జీవితం మెరుగు పడుతుంది. కాకుండా ఆమెని బాధ పెట్టి ఆమె అడుగులని తప్పు అంటూ, ఆమెని పదే బాధ పెట్టి కనుక జీవిస్తే ఆ జీవితం మరుగున పడుతుంది కానీ ఎప్పటికి కూడా మెరుగు పడదు.

 

 

కాబట్టి అమ్మని ఎప్పుడు కూడా దూషించకూడదు. అమ్మని ఎప్పుడు బాధ పెట్టకూడదు. అమ్మ ముఖం లో ఆ చిరునవ్వుకు కారణం నీ జీవితాన్ని చేసి ఆ ముఖం పై నవ్వుని ప్రతీ బిడ్డ ఇవ్వాలి. అప్పుడే ఆ జన్మకి అర్ధం ఉంటుంది. అణుకువ నేర్పుతుంది అమ్మ... అన్ని తానై కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటుంది అమ్మ....

 

 

నిత్యం నీడలా, వెలుగుల హాయిని పంచుతూ బ్రతుకులో గెలుపులని పూయిస్తుంది అమ్మ. కాబట్టి అమ్మ వ్రేలు విడువకు. అమ్మ ప్రేమని వదలకు. అమ్మని నిత్యం చూసుకోవాల్సిన భాద్యత కూడా బిడ్డది. కాబట్టి ఆమెని నవ్వించు నిరంతరం ఆ నవ్వుని ఆమె పెదవిపై ధరించడానికి కారణం నువ్వు అవ్వు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: