విజయం మీదే : బలహీనతలను బలంగా మార్చుకుంటే విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

ప్రతి మనిషికి తనకు మాత్రమే సొంతమైన కొన్ని బలాలు, తనకు మాత్రమే సొంతమైన కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏ వ్యక్తి అయినా చేసే పనిలో విజయం సాధించాలంటే ముందుగా బలాలను, బలహీనతలను గుర్తించాలి. మన బలహీనతలను ఎదుర్కొనే సమయంలోనే మన బలాలేంటో మనకు తెలుస్తాయి. ఏ వ్యక్తి అయితే తన బలహీనతలను గుర్తించి ఆ బలహీనతలను బలాలుగా మార్చుకుంటాడో ఆ వ్యక్తికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 
చాలామంది తమ బలహీనతలు ఏంటో తమకే తెలీదని చెబుతూ ఉంటారు. ఆరు విషయాలను గుర్తుంచుకుంటే మన బలహీనతలేంటో మనకే సులభంగా తెలుస్తాయి. ముందుగా మన బలహీనతలను గుర్తించటానికి ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆ బలహీనతలను పేపర్ పై రాసుకోవాలి. కొందరు బలహీనతలు తెలిసినప్పటికీ అవి బలహీనతలు అని అంగీకరించరు. అలా అంగీకరించకపోవడం వలన తమకే నష్టం కలుగుతుందని గుర్తుంచుకోవాలి. 
 
మన బలహీనతలను మనం గుర్తించలేకపోతే మనకు నమ్మకంగా ఉండేవారిని ఎంచుకొని మీలో వారు చూసిన బలహీనతల గురించి అడగాలి. వారు చెప్పిన విషయాల గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. గుర్తించిన బలహీనతల ప్రభావం తగ్గించటానికి, బలహీనతలను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనలోని బలహీనతలను తగ్గించడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. నైపుణ్యాలను పెంపొందించుకోవటం ద్వారా దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. కొన్ని పనులను ఒంటరిగా చేయలేము. అందువలన ఇతరుల సహాయం తీసుకొని ఇద్దరి బలాలను కలిపి ఎంచుకున్న పనిలో విజయం సాధించవచ్చు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: