విజయం మీదే : బద్ధకాన్ని వీడితే విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

జీవితంలో విజయం సాధించాలంటే మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఏర్పడతాయి. ఆ సమయంలో మనం పట్టుదలతో లక్ష్యసాధన దిశగా అడుగులు వేయాలి. కొందరు పట్టుదలతో విజయాలను సాధిస్తోంటే కొందరు మాత్రం బద్ధకంతో పట్టుదల లేకుండా ఏ పనిని సాధించక సోమరిపోతులుగా మిగిలిపోతున్నారు.
 
బద్ధకస్తులుగా ఉన్నవారు ఎంతసేపైనా తాము చేయాల్సిన పనిని ఇతరుల మీదకు ఎలా తోసెయ్యాలని ఎంతసేపటికి తమ ముందు ఉన్న పనిని ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తుంటారు లేదా చేయాల్సిన పనిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ తరువాత ఆ పనిని పూర్తి చేద్దాంలే...? అనే భావనలో ఉంటారు. బద్ధకం, సోమరితనం మనలో ఉంటే ఆ సోమరితనం, బద్ధకమే మనను నాశనం చేస్తుందని గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ సోమరితనంతో తప్పించుకునే మార్గాలను వెతికితే ఆ తరువాత జీవితాంతం బాధ పడాల్సి ఉంటుంది. 
 
బద్ధకంతో చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేస్తే ఆ భారం అంతా ఒకేసారి మీద పడుతుంది. అందువలన బద్ధకాన్ని వీడి అంకితభావంతో పని చేస్తే మాత్రమే విజయం సాధించగలమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. విజయం సాధించాలి అంటే కలలు కంటే సరిపోదని బద్ధకాన్ని వదిలి కలకు సరిపోయే కృషి కూడా చేయాలని గుర్తుంచుకోవాలి. మనం కోరికల గురించి, కలల గురించి ఆలోచిస్తూ ఉండటం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రణాళికబద్ధమైన శ్రమ చేయటం ద్వారా మాత్రమే సత్ఫలితాలు కలుగుతాయి. లక్ష్యాన్ని స్పష్టంగా ఎంచుకుని ఆ లక్ష్యం కొరకు అహర్నిశలు అంకితభావంతో పని చేస్తే విజయం సాధించగలమని గుర్తుంచుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: