ఆకలితో ఉంటే.. పడుకుంటావా అనేవారు.. మహిళ ఆవేదన..!!

Mamatha Reddy
ఏ రంగంలో ఉన్న మహిళలకైన కొన్ని కష్టాలు తప్పట్లేదు. కామాంధులు క్రూరులుగా వారిని అణచి వేస్తుంటే ఆ బాధ తట్టుకోలేక మహిళలు గింజు కుంటున్నాడు. పై స్థాయిలో ఉన్న మహిళ అయినా, కింద స్థాయిలో ఉన్న మహిళ అయినా, ఏ వయసులో ఉన్న మహిళ లను అయినా ఈ కామాంధులు వదిలి పెట్టకుండా వారిని, వారి జీవితాన్ని కష్టాల ఊబిలోకి నెడుతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది మహిళలు తమ ప్రాణాలు విడిచి నిరసనలు తెలియజేస్తున్నారు. అయినా వారి ప్రవర్తన మారట్లేదు.

చెన్నైకి చెందిన ఓ 38 ఏళ్ల గృహిణి శాంతికి మహానగరంలో ఒక ఇల్లు ఉంది. రైల్వేస్ లో కాంట్రాక్ట్ లేబర్ గా ఉద్యోగం ఉంది. కూతురితో కలిసి ప్రశాంతంగా జీవనం సాగిస్తోంది. అయితే ఈ సుఖం వెనక ఆమె పడిన కష్టాలు ఎన్నో ఉన్నాయి. ఆకలి తీర్చుకోవడానికి రోడ్డు పక్కన పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాత్రి పూట రోడ్డు పక్కన మీద పడుకుంటూ ఎన్నో కష్టాలను అనుభవించింది శాంతి. ఒక చీర తో తన జీవనం కొనసాగిస్తూ దాన్నే రాత్రి ఉతుక్కుని వేసుకుని పడుకునేదాన్ని. రాత్రిపూట గోనె సంచులు కప్పుకుని రోడ్లపక్కన పడుకునే వాళ్ళం. ఆకలవుతుందని అడుక్కుంటే కొంతమంది పడుకుంటావా అని అడిగేవాళ్లు.

 అలాంటిది ఓ స్వచ్ఛంద సంస్థ వల్ల మా జీవితాలు మారాయి. ఇప్పుడు నేను ఇంటికి యజమానురాలిని. సంస్థకు ఎంప్లాయిని. ఓ బిడ్డకు తల్లిని అని చెప్పుకొచ్చింది. నా కూతురు తో కలిసి ప్రశాంతంగా జీవితం గడుపుతున్న. నేనే కాదు.. నా తోటి వారు ఎంతో మంది జీవితాలు మారాయి. రోడ్ల పక్కన నివసించే వారి కోసం ఈక్వి టాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏర్పాటు చేసిన బర్డ్ నెస్ట్ కార్యక్రమం కింద నాలాంటి వారి జీవితాలు మారాయి. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు రోడ్ల పక్కన నివసించే వారిని గుర్తించి అర్హులైన వారికి ఈ విధంగా పునరావాసం కల్పిస్తారు. ఉద్యోగం చూపించడమే కాకుండా వారి పిల్లల చదువు ఖర్చును భరిస్తారు. అలాగే ఓటర్ ఐడి ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా ఇస్తారు. 2010 లో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా రోడ్ల పక్కన నివసించే వారికి పునరావాసం కల్పించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: