అమ్మ: గర్భిణీలకు గుండెల్లో మంటగా ఉందా..?

N.ANJI
పిల్లలకు జన్మనివ్వాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంది. ఇక గర్భం దాల్చినప్పడి నుండి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు గర్భిణులు ఒత్తిళ్లకు లోనవుతారు. ఇక గర్భవతి మహిళకు కొన్ని సార్లు పక్కటెముకలనుండి మొదలై గొంతువరకు విపరీతమైన మంట వస్తుంది. ఏ మాత్రం హానికరం కాకపోయినా దీనిని గుండె నొప్పి అని కూడా కొంతమంది భయపడతారు. ఈ సమస్య గర్భవతి మహిళకు తరచుగా ఎదురవుతుంది. దీనికి కారణం పరిశీలిస్తే, మహిళ గర్భవతైనపుడు అజీర్ణం ఏర్పడుతుంది. దానికి ప్రధాన కారణాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.
అయితే అదనపు గ్రంధి గర్భవతికి అదనంగా ఎండోక్రైన్ గ్రంధి ఒకటి పని చేస్తుంది. పిండానిని పట్టుకునే ప్లాసెంటా కూడా కొన్ని హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. ప్రొజెస్టిరోన్ అధికంగా ఉత్పత్తి అయి దాని ప్రభావం ఇతర గ్రంధులపై పడుతుంది. ఆమ్ల ఆహారం కడుపులో మధించబడి ఆహార గొట్టానికి వెనక్కు పంపిస్తుంది. ఈ చర్య కడుపులో అక్కడనుండి గుండె ప్రాంతంలోకి మంట కలిగిస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. దానికి తగ్గట్టు పెరుగుతున్న పిండం కారణంగా కడుపులో ఖాళీ ప్రదేశం తగ్గిపోతుంది.
ఇక ఈ సమస్య నివారణకు తేలికగా జీర్ణం అయే ఆహారం తీసుకోవాలి. కొద్దిమొత్తంలో ఎక్కువసార్లు తినాలి. దీనితో ఆహారం వెనక్కు వచ్చే సమస్య వుండదు. తీసుకున్న ఆహారాన్ని బాగా నమలండి. భోజనం తర్వాత లవంగం, వంటి మౌత్ ఫ్రెషనర్స్ కూడా జీర్ణక్రియకు తోడ్పడతాయి. పడకకు వెళ్ళే సమయంలో తినకండి. తిన్న రెండు గంటల తర్వాత పడకకు చేరండి. మసాలాలు, పులుపు పదార్ధాలు తినకండి.
గర్భిణులు బిగువు దుస్తులు ధరించకండి. ప్రత్యేకించి నడుము భాగంలో టైట్ లేకుండా చూడండి. ఈ చర్యలు చేపట్టి గుండె మంట రాకుండా జాగ్రత్తలు పడండి. ఇక పైన తెలిపిన చిట్కాలతో గర్భవతి ఛాతీ మంట తగ్గకపోతే, తక్షణ వైద్య సహాయం పొందండి. వైద్యుల సలహాలు పాటించి నివారించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: