జుట్టు రాలుతుందా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే..!

N.ANJI
ప్రస్తుతం చాల మంది జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతున్నా, బట్టతల వస్తున్నట్లు అనిపిస్తున్నా, తమకు తెలియకుండానే ఒక రకమైన టెన్షన్‌లో పడిపోతుంటారు చాలా మంది. దీనికి అనేక కారణాలుంటాయి. అయినప్పటికి జుట్టు రాలిపోతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అయితే జుట్టు రాలే సమస్య నుండి ఎలా బయటపడాలో.. ఏం చేయాలో చూద్దాంమా.
జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే. ఇక విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నువ్వులనూనెను తలకు బాగా పట్టించి, కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే క్రమంగా జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. మందార పువ్వులను, కొబ్బరినూనె లేక నువ్వుల నూనెలో వేసి కాచి, ఆ నూనెను వెంట్రుకలకు పట్టించి ఒక గంట తర్వాత కుంకుడు రసంతో స్నానం చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. మందార ఆకులను మెత్తగా నూరి, తలకు బాగా పట్టించి కాసేపటి తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఊడదని వైద్యులు తెలిపారు. ఉసిరి రసం తీసి తలకి రాస్తే వెంట్రుకలు ఊడడం తగ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
అంతేకాదు దోస గింజలు ఎండబెట్టి, దంచి, నూనె తీసి, దాన్ని నిమ్మరసంతో కలిపి తలకు రాస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. చేమ దుంపల రసం తీసి తలకు రాస్తే జుట్టు ఊడటం ఆగిపోతుంది. నాలుగు టీ స్పూన్ల కొబ్బరి పాలలో, ఒక స్పూను నిమ్మరసం కలిపి, తలకు బాగా పట్టించి, కాసేపయ్యాక తలస్నానం చేస్తే జుట్టు రాలదు. ఈ చిట్కాల్లో ఎన్ని వీలైతే అన్ని పాటించాలని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. ఇంత చేసినా జుట్టు రాలడం ఆగకపోతే, డాక్టర్‌ను సంప్రదించడం సరైన మార్గమంటున్నారు పరిశోధకులు. డాక్టర్లు తగిన కారణాల్ని తెలుసుకొని, అందుకు తగిన ట్రీట్‌మెంట్ సూచిస్తారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: