ఉసిరితో ఇలా చేస్తే జుట్టు సమస్యలు ఉండవు తెలుసా.. !!

Suma Kallamadi
ఉరుకుల పరుగుల జీవితంలో ఆడవాళ్లు జుట్టు మీద తీసుకునే శ్రద్ద తగ్గిపోతుంది. ఫలితంగా జుట్టు రాలడం, జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఆడవాళ్ళకి  నల్లటి, పొడవాటి, ఒత్తయిన జుట్టు అంటే చాలా ఇష్టం. కానీ ఈ కాలంలో ఆడవాళ్లు ఎదుర్కునే ముఖ్య సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి.ఎప్పుడు ఉసిరితో మేము చెప్పబోయే చిట్కాలు పాటిస్తే జుట్టు సమస్యలు అనేవి మటుమాయం అవుతాయి. ఉసిరి జుట్టుకి మంచి పోషణను ఇస్తుంది. ఆమ్లాలో ఉండే విటమిన్ సి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి హెయిర్ లాస్ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది.ఆమ్లా ఆయిల్‌తో తలకి మసాజ్ చేసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. ఆమ్లాలో విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్, ఫైటో న్యూట్రియెంట్స్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి.

ఉసిరి నూనెను సులభంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కొబ్బరి నూనెను వేడి చేయాలి. అందులో కాస్తంత ఆమ్లా పౌడర్ ను యాడ్ చేయాలి. బ్రౌన్ కలర్ లోకి మారేవరకు వేచి చూడాలి. ఈ ఆయిల్ కాస్తంత చల్లారాక, ఇప్పుడు ఈ ఆయిల్ ను స్కాల్ప్ పై అప్లై చేయాలి. జుట్టు కుదుళ్ళనుంచి అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి.ఆమ్లాలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు కుదుళ్ళలోకి చొచ్చుకుని పోయి హెయిర్ ను సాఫ్ట్ గా అలాగే దట్టంగా మారుస్తుంది. ఇది హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది కూడా. ఆమ్లాలో ఐరన్‌తో పాటు కెరోటిన్ కంటెంట్ సమృద్ధిగా లభిస్తుంది.మీరు చేయాల్సిందల్లా ఆమ్లా పౌడర్‌ని రీటా అలాగే శీకకాయి వంటి హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ తో కలిపి మిక్స్ ను తయారు చేయాలి. ఈ పేస్ట్‌ని తలవెంట్రుకలపై అప్లై చేయాలి. కాసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత మైల్డ్ షాంపూతో దీన్ని వాష్ చేయాలి. వారానికి కనీసం ఒకసారిలా చేయాలి.


అలాగే  రెండు టేబుల్ స్పూన్స్ ఆమ్లా పౌడర్‌ని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ మెంతుల పొడిని కలపండి. ఈ మిశ్రమానికి ఐదు టేబుల్ స్పూన్స్ వెచ్చటి నీరును కలపండి. స్మూత్ మిక్స్చర్ వచ్చే వరకు బాగా కలపండి.ఈ పేస్ట్ రాత్రి అంతా నానపెట్టాలి.మరుసటి ఉదయాన్నే, ఈ మిక్శ్చర్‌ని స్కాల్ప్ అలాగే హెయిర్‌పై జెంటిల్ గా అప్లై చేయాలి. ఈ మాస్క్‌ని కనీసం ఇరవై నిమిషాలపాటు తలపై ఉండనివ్వాలి. ఆ తరువాత హెయిర్ ను చల్లటి నీటితో వాష్ చేయాలి. హెయిర్ వాష్ కోసం మైల్డ్ సల్ఫేట్ ఫ్రీ షాంపూను వాడొచ్చు. ఈ ప్రాసెస్‌ని వారానికి ఒకటి, రెండు సార్లు పాటిస్తే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: