విజయం మీదే: ఈ లక్షణాలను వీడితే కెరీర్ లో సులువుగా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar
మారుతున్న కాలంతో పాటే ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ పాత్ర కూడా మారుతోంది. పోటీ ప్రపంచంలో ఎంతో శ్రమించే వారికి మాత్రమే విజయం సొంతమవుతోంది. సమాజంలో సక్సెస్ ఉన్నవారికి మాత్రమే విలువ దక్కుతోంది. కెరీర్ లో సక్సెస్ సాధించని వారికి ఇంటాబయట ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. మనం కొన్ని లక్షణాలను కలిగి ఉంటే జీవితంలో ఎప్పటికీ విజయాన్ని సొంతం చేసుకోలేము.
 
సక్సెస్ సాధించాలంటే మొదట ఇతరులపై ఆధారపడటం వీలైనంత తగ్గించాలి. ఇతరులపై ఆధారపడుతూ జీవిస్తే మనం ఎప్పటికీ ఎదగలేము. మనకు తెలియని విషయాలను వీలైనంత వరకు సొంతంగా నేర్చుకోవడమే ఉత్తమం. సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా తర్వాత సులభంగా నేర్చుకోగలిగే అవకాశం ఉంటుంది. మనలో చాలా మంది జీవితంలో వచ్చే చిన్న చిన్న మార్పులకు భయపడుతూ ఉంటారు.
 
ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనేది సహజమైన ప్రక్రియ. మార్పుకు భయపడితే కెరీర్ లో, జీవితంలో ఎప్పటికీ ఎదగలేము. కొన్ని సందర్భాల్లో మార్పులను ఆహ్వానిస్తే ఉన్నత శిఖరాలను మనం సులభంగా అధిరోహించగలలుగుతాం. కొన్ని సందర్భాల్లో సక్సెస్ కోసం ఎంత ప్రయత్నించినా ఫెయిల్యూర్ చవి చూడాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో మనపై మనం నమ్మకం, విశ్వాసం కోల్పోకూడదు. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను వీడి సక్సెస్ కోసం ప్రయత్నిస్తే మంచి ఫలితాలను అందుకోవచ్చు.
 
చాలా సందర్భాల్లో మనల్ని మనం తక్కువగా అంచనా చేసుకుంటూ ఉంటాం. సాధించే సత్తా ఉన్నా మనపై మనకి నమ్మకం లేకపోవడం వల్ల సక్సెస్ సాధించలేకపోతూ ఉంటాం. మనల్ని మనం నమ్మి చేసే పనిలో విజయం సాధిస్తామని విశ్వాసం కలిగి ఉంటే మంచి ఫలితాలు అందుతాయి. మరి కొంతమంది చిన్న విషయాలకు కూడా అతిగా స్పందిస్తూ, ఆలోచిస్తూ ఉంటారు. అతిగా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు. అతిగా స్పందించే అలవాటును తగ్గించుకుంటే మన కెరీర్ కి ప్రయోజనం చేకూరుతుంది. పైన పేర్కొన్న లక్షణాలను వీడితే కెరీర్ లో మంచి స్థానాలకు చేరుకోగలుగుతాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: