విజయం మీదే : ఏకాగ్రతతో లక్ష్యం కోసం శ్రమిస్తే సులువుగా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar
మనలో చాలామంది సంవత్సరాల తరబడి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయం దగ్గరి వరకు వచ్చి ఆగిపోతూ ఉంటారు. ప్రతిసారి ఇలాంటి అనుభవాలే ఎదుర్కొనే వాళ్లు చాలామంది ఉంటారు. చాలామంది కెరీర్ లో సక్సెస్ కోసం ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుంటారు. మొదట్లో కొన్ని రోజులు చదువుకోవాలనే పట్టుదల బాగుంటుంది.ఆ తర్వాత చదువుకోవాలనే ఆసక్తి మెల్లిగా తగ్గి స్నేహితులతో చాటింగ్‌, సినిమాలు, వాట్సప్‌, ఫేస్‌బుక్‌లతో కాలక్షేపం చేస్తూ గడిపేస్తూ ఉంటారు.
 
కొంతమంది ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకున్నా పరిస్థితుల ప్రభావం వల్ల సక్సెస్ కాలేకపోతున్నామని చెబుతున్నారు. చాలామంది సమయాన్ని వృథా చేసి బాధకు, అశాంతికి లోనవుతూ బాధ పడుతున్నారు. నిజానికి ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నంత మాత్రాన సరిపోదు. లక్ష్యం నిర్ధారణ అయ్యాక లక్ష్యానికి సంబంధించిన పనిని మాత్రమే ఆలోచనలను పక్కకు మళ్లించకుండా చేస్తే విజయం తప్పక సొంతమవుతుంది.
 
సక్సెస్ సాధించాలంటే మొదట ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని... లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన నైపుణ్యాలు నేర్చుకోవాలి. అనంతరం లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన అలవాట్లను అలవరచుకొని ఎంచుకున్న లక్ష్యం విషయంలో దృఢంగా ఉండాలి. మనకున్న బలహీనతలను, పరిమితులను అధిగమిస్తూ శ్రమించాలి. ఈ విధంగా శ్రమించి అంతిమ లక్ష్యాన్ని సాధించాలి.
 
కెరీర్ లో విలువైన సమయాన్ని వృథా చేసుకుని తర్వాత బాధ పడినా ప్రయోజనం ఉండదు. ఏకాగ్రతతో లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలి. ఫలానా సబ్జెక్ట్‌ సరిగ్గా రావడం లేదంటే ఏకాగ్రత తగ్గుతుంది అని గుర్తించి దానిని అభివృద్ధి పరుచుకొనే ప్రయత్నాలు చేయాలి. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే తలంపు మనల్ని దృఢంగా మారుస్తుంది. గత అనుభవాలు మన జీవితానికి ఒకసారి పాఠాలుగాను, ఒక్కొక్కసారి పరిమితులను కూడా విధిస్తాయి. ఆ పరిమితులను అధిగమించి ప్రయత్నిస్తే విజయం తప్పక సొంతమవుతుంది. ఆ పరిమితి రావడానికి కారణమైన వాటిని శోధించి పట్టుకొని దాన్ని ఛాలెంజ్‌ చేసి.. హద్దులు చెరిపేసి... అవసరమైన నైపుణ్యాలను అలవరచుకొని విజయం సాధించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: