విజయం మీదే : ఆత్మవిశ్వాసం పెంచుకుని లక్ష్యం కోసం ప్రయత్నిస్తే విజయం మీ సొంతం

Reddy P Rajasekhar
మారుతున్న కాలంతో పాటే అన్ని రంగాల్లో పోటీతత్వం విపరీతంగా పెరుగుతోంది. ఎంతో కష్టపడితే మాత్రమే సక్సెస్ ను సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. చాలామంది సక్సెస్ సాధించే సత్తా ఉన్నా తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల ఫెయిల్యూర్ ను చవిచూస్తున్నారు. మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోకూడదు. మనలోని మంచి గుణాలు, సామర్థ్యాల జాబితాను తెలుసుకుంటే మనపై మనకు ప్రేమ పుడుతుంది.
 
కొన్ని సందర్భాల్లో మనం ఎంత కష్టపడినా అనుకూల ఫలితాలు రావు. అలాంటి సమయంలో సానుకూల దృక్పథంతో ఉండాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించాలి. పెదవిపై చిరునవ్వును చెరగనీయకుండా సక్సెస్ కోసం శ్రమిస్తే జీవితంలో సులువుగా ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాం. కొంతమందిలో అన్ని సామర్థ్యాలున్నా సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నారు.
 
ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు, ఓటమి రెండు ఉంటాయి. రెండింటినీ సమ భావంతో స్వీకరించాలి. చేసిన తప్పు మళ్లీ చేయకూడదు. ప్రతి ఒక్కరికీ సమాన సామర్థ్యాలుంటాయి. వాటిని ఏ స్థాయిలో వినియోగించుకున్నారన్న దానిపైనే మనం విజయం సాధించగమో లేదో ఆధారపడి ఉంటుంది. మన సమస్యలకు ఇతరులను, పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోను నిందించకూడదు. అవసరమైతే ఇతరుల సహకారం తీసుకోవాలి.
 
చిన్నచిన్న విషయాలను భూతద్దంలో చూడకుండా సర్దుబాటు ధోరణిని కలిగి ఉండాలి. ఎదుటివారు చెప్పే దానిలో వాస్తవం ఉంటే అంగీకరించాలి. ఈరోజు మీరు ఎలా ఉన్నారో పోల్చుకొని రేపు ఎలా ఉండాలో నిర్దేశించుకోవాలి. స్వీయ అనుభవం ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. వీటిని అక్కడితో వదిలేయకుండా, అవసరమైనపుడు లోకజ్ఞానం జోడించి శరమిస్తే విజయం తప్పక సొంతమవుతుంది. కాలయాపన చేయకుండా బాధ్యతగా నిజాయితీతో లక్ష్య సాధనకు కృషి చేస్తూ ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తే సక్సెస్ తప్పక సొంతమవుతుంది. ఇతరులపై ఆధారపడకుండా బలాలను గుర్తిస్తూ బలహీనతలను అధిగమిస్తే సులువుగా సక్సెస్ ను సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: