విజయం మీదే : నిర్లక్ష్యాన్ని వీడి శ్రమిస్తే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar
మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని డబ్బు సంపాదించాలని కలలు కంటూ ఉంటారు. అయితే నిర్లక్ష్యం, భయం చాలామంది జీవితంలో సక్సెస్ కాకపోవడానికి కారణమవుతున్నాయి. చాలామంది మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా ఇతర వ్యాపకాల్లో పడి కాలాన్ని వృథా చేస్తూ ఉంటారు. మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కష్టపడితే కొంత ఆలస్యంగానైనా సక్సెస్ తప్పక సొంతమవుతుంది.
 
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఒక పరీక్షలో సక్సెస్ సాధించలేకపోయినా మరో పరీక్షలో తప్పనిసరిగా మంచి మార్కులు సాధిస్తామని... ఒక్క మార్కు తగ్గి వైఫల్యం ఎదురైతే జీవితం ముగిసిపోయినట్లు కాదని గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోను లక్ష్యం కోసం శ్రమించే విషయంలో మనం నిర్లక్ష్యం వహించకూడదు. తోటి వాళ్లతో పోల్చుకుని మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు. ఇతరులతో పోల్చుకోవడం ద్వారా మన గురించి మనం తక్కువగా అంచనా వేసుకునే అవకాశం ఉంది.
 
పోటీ పరీక్షల్లో ఓటమిపాలైనా మరో పరీక్షలో విజయం సాధిస్తామనే ఆశావహ దృక్పథాన్ని అలవరచుకోవాలి. ఫెయిల్‌ అయినా ఏం కాదు... మరోసారి ప్రయత్నిస్తే సక్సెస్ అవుతామనే ఆలోచనను కలిగి ఉండాలి. కష్టపడుతున్నా కానీ సరిగా రాయలేమేమో, పాస్‌ కాలేమేమో, మంచి మార్కులు రావేమో అనే భయం ఎవరిలోనైతే ఉంటుందో వాళ్లు సక్సెస్ సాధించలేరు. వాళ్ల భయమే వాళ్లు ఫెయిల్ కావడానికి కారణమవుతుంది.      
 
కష్టపడి చదివినా అనుకున్న ప్రశ్నలు రాకపోవడం.. ఫెయిల్‌ అవుతామేమోనన్న ప్రతికూల ఆలోచనలతో చాలామంది అనవసర భయాలను పెంచుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం పెంపొందించుకుంటే సులువుగా విజయం సొంతమవుతుంది. ఓడిపోతామేననే భయంతో ఎట్టి పరిస్థితుల్లోను మన ప్రయత్నాన్ని ప్రారంభించకూడదు. కెరీర్ లో సక్సెస్ సాధిస్తామనే నమ్మకం మనపై మనకు ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధించడం సాధ్యమవుతుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన ప్రణాళికా వ్యూహంతో ఫలితం గురించి ఆలోచించకుండా శ్రమిస్తే విజయం తప్పక సొంతమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: