విజయం మీదే : భయాన్ని వీడి లక్ష్యం దిశగా అడుగులు వేస్తే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar
మనలో ప్రతి ఒక్కరిలో జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కోరిక బలంగా బలంగా ఉంటుంది. అయితే కోరికలు నిజం కావడం సులభం కాదు. అలా అని అసాధ్యం కాదు. ఎవరైతే సరైన వ్యూహంతో శ్రమిస్తారో వాళ్లు జీవితంలో సక్సెస్ అవుతారు. అలా కాకుండా మనం కెరీర్ లో ఎదగట్లేదని మనం దేనికీ పనికిరామనే భావనతో ఉంటే మాత్రం ఎప్పటికీ సక్సెస్ సొంతం కాదు. ప్రస్తుత కాలంలో చెత్తలో వేసిన తుప్పు కూడా పనికి వస్తుంది.
 
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ను గుర్తించి సరైన లక్ష్యాన్ని ఎంచుకుని భయాన్ని వీడి సక్సెస్ కోసం ప్రయత్నిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరగలుగుతాం. కెరీర్ లో చాలా మంది సక్సెస్ కాకపోవడానికి సరైన లక్ష్యం లేకపోవడం... ఆ లక్ష్యం దిశగా నడిపించే మార్గదర్శి లేకపోవడమే కారణాలు. సాధించాలి అనే బలమైన సంకల్పం లేకపోతే ఏ పనిలోనైనా విజయం సాధించలేం.
 
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరువాత దానిని సాధించే చివరి నిమిషం వరకు శ్రమించాలి. పట్టు వదలని విక్రమార్కుడిలా లక్ష్యం కోసం పోరాడాలి. ప్రస్తుతం ఉన్న స్థితి నుండి సక్సెస్ వైపుగా అడుగులు వేయాలి. మంచి సంకల్పంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి విజయం వైపు రావడానికి శ్రమించాలి. సాధిస్తామనే విశ్వాసంతో లక్ష్యం దిశగా అడుగులు వేయాలి.
 
మన కెరీర్ లో విలువైన సమయాన్ని వృథా చేస్తే ఎన్నో అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. భయపడుతూ లక్ష్యసాధన దిశగా ప్రయత్నాలు చేస్తే ఎప్పటికీ సక్సెస్ సాధించలేం. విజయాల వల్ల డబ్బు, గౌరవం, పేరు ప్రతిష్ఠలు, కష్టానికి తగిన ప్రతిఫలం సాధించామన్న తృప్తి కలుగుతాయి. కరోఠ దీక్ష, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలనే ధృడ సంకల్పాన్ని కలిగి ఉండి... భయాన్ని అధిగమించి... అసూయను వీడి శ్రమిస్తే ఏ పనిలోనైనా సులువుగా విజయం సొంతమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: