విజయం మీదే : నెగిటివ్ ఆలోచనలను వీడితే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

మనలో చాలామందికి సక్సెస్ సాధించడానికి అనేక అవకాశాలు వస్తాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటే జీవితంలో విజయం సాధించగలుగుతాం. జీవితంలో మనకు ఏదైనా మంచి అవకాశం వస్తే వెంటనే దానిని అందిపుచ్చుకుని ఎదగడానికి కృషి చేయాలి. మనలో చాలామంది ఉన్నచోటు నుంచి మరో చోటుకు వెళ్లాలన్నా, ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారాలన్నా ఆందోళనకు గురవుతూ ఉంటారు. 
 
మనం అప్పటివరకు అలవాటైన ప్రదేశాలను, స్నేహితులను విడిచిపెట్టి ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారడానికి ప్రయత్నిస్తే మళ్లీ మొదటినుంచి జీవితాన్ని ఆరంభించాల్సి వస్తుందని చాలామంది భయపడుతూ ఉంటారు. ఒకవేళ ఆ పని ఇష్టం లేకపోతే తప్పించుకోవడానికి మనం అనేక మార్గాలను వెతుకుతూ ఉంటారు. బావిలో కప్పలా ఉన్న చోటే ఉంటూ అదే ప్రపంచం అనుకుంటూ ఆనందంగా గడపటనికి ప్రయత్నాలు చేస్తారు. 
 
మనలో అందరూ ఇలా ఉండకపోయినా చాలామంది ప్రవర్తన ఇదే విధంగా ఉంటుంది. ఏదైనా సమస్య ఎదురైతే తప్పించుకోవాలని ప్రయత్నించడం సాధారణంగా కనిపించే అంశమే. చాలామంది ఈ విధంగా ప్రవర్తించడానికి నెగిటివ్ భావనే కారణం. ఆత్మవిశ్వాసం ఉన్నవారికి విజయం సాధిస్తామనే నమ్మకం మెండుగా ఉంటుంది. ఆత్మనూన్యతా భావంతో బాధ పడే వాళ్లు ఏ పని చేయడానికైనా భయాందోళనకు గురవుతారు. 
 
మనలో ఒక పనిని చేయలేనేమో అనే భావన ఎక్కువైతే ఆ ఆలోచనా ధోరణిని నెగిటివ్ ఆలోచనా దృక్పథమని అంటాము. నెగిటివ్ ఆలోచనలతో ఏ పనినైనా మొదలుపెడితే ఆ పనిలో విజయం ఎప్పటికీ సొంతం కాదు. అందువల్ల నెగిటివ్ ఆలోచనలకు వీలైనంత దూరంగా ఉండాలి. కష్టపడితే ఏ పనిలోనైనా విజయం సాధించడం సాధ్యమే. అందువల్ల నెగిటివ్ భావనలను వీడి సక్సెస్ కొరకు ప్రయత్నిస్తే సులభంగా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు.                                  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: