విజయం మీదే : ఈ సత్యాలను గ్రహిస్తే ఏ పనిలోనైనా సులువుగా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

మనలో చాలామందిలో సక్సెస్ సాధించటానికి కావాల్సిన లక్షణాలు అన్నీ ఉంటాయి. కానీ వాళ్లు అనుకున్న పనిలో మాత్రం విజయం సాధించలేకపోతూ ఉంటారు. అలా సక్సెస్ సాధించకపోవడానికి కారణాలంటో తెలియనివాళ్లు మనలో చాలామందే ఉంటారు. అయితే పలు అధ్యయనాల్లో చాలామంది భయం, ఒత్తిడి వల్ల సక్సెస్ సాధించలేకపోతున్నారని తెలుస్తోంది. ఏ విషయం గురించైనా సాధిస్తామనే నమ్మకంతో మనం ముందడుగులు వేయాలి. 
 
ఏదైనా సమస్య ఎదురైతే దానిని పరిష్కరించగలనా...? లేదా....? అని ఆలోచిస్తూ ఒత్తిడికి గురి కావడం కంటే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చని ఆలోచించిన వాళ్లే విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఎలాంటి సమస్య ఎదురైనా పాజిటివ్ గా ఆలోచించాలి అదే సమయంలో ఆ లక్ష్యాన్ని సాధించడానికి నూటికి నూరు శాతం శ్రమించాలి. శ్రమించకుండా పాజిటివ్ గా ఆలోచించే అలవాటు ఉన్నా మంచి ఫలితాలు దక్కవు. 
 
మన ఆలోచనా విధానంలో మార్పు వస్తే మాత్రమే సక్సెస్ ను సులభంగా సొంతం చేసుకోగలుగుతాం. బాధ్యతలు, సమస్యల బరువు మనల్ని ఏ క్షణాన ఒత్తిడిలోకి నెట్టేయకూడదు. మనం అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నామంటే చెత్తను మనస్సులో చేర్చుకుంటున్నామని గుర్తుంచుకోవాలి. మన బలాలు, బలహీనతలను గుర్తించుకుంటూ కెరీర్ లో సక్సెస్ వైపు అడుగులు వేయాలి. 
 
మనం ఇతరులను నమ్మాలి. అదే సమయంలో అతిగా నమ్మకూడదు. శ్రమతో మాత్రమే సక్సెస్ సొంతమవుతుందని... మంత్రాలకు చింతకాయలు ఎలా రాలవో పని చేయకుండా డబ్బులు కూడా అలాగే రావని గుర్తుంచుకోవాలి. శ్రమ, నమ్మకంతో సక్సెస్ సాధించగలమని మనపై మనకు పూర్తి విశ్వాసం ఉంటే మాత్రమే విజయం సొంతమవుతుంది. ఒత్తిడిని వీడి సక్సెస్ ను సాధించడం కోసం ప్రయత్నిస్తే విజయం తప్పక సొంతమవుతుంది. ప్రతి మనిషి ఈ సత్యాలను గ్రహిస్తే ఏ పనిలోనైనా సులువుగా విజయం సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: