విజయం మీదే : ఈ విధంగా జ్ఞాపకశక్తిని పెంచుకుంటే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

మనలో చాలామంది మతిమరపు వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఏటీఎం పిన్ నంబర్లు, బాగా పరిచయం ఉన్నవాళ్ల ఫోన్ నంబర్లు, ముఖ్యమైన విషయాలను మరిచిపోతూ ఉంటారు. మతిమరపు వల్ల చాలామంది విజయాన్ని సొంతం చేసుకోలేకపోవడంతో పాటు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎంతసేపు ఆలోచించినా జ్ఞప్తికి రాకపోవడంతో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. 
 
విద్యార్థులలో చాలామంది మతిమరపు వల్ల పరీక్షల్లో తెలిసిన ప్రశ్నలకు సైతం సమాధానాలు రాయలేకపోతూ ఉంటారు. బైక్ కీస్, సోషల్ మీడియా అకౌంట్ల పాస్ వర్డ్స్ కూడా మరిచిపోయే వారి సంఖ్య ఎక్కువే. అయితే మరికొంతమంది మాత్రం ఏ విషయాలనైనా మరిచిపోకుండా అందరితో ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. ప్రస్తుత సమాజంలో ఇలా రెండు రకాలుగా ఉండే మనుషులను మనం రోజూ చూస్తూ ఉంటాం. 
 
అయితే పరిశోధకులు మాత్రం వీక్ మెమరీ, స్ట్రాంగ్ మెమరీ ఉండదని కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు. మనకు ఏదైనా కొత్త విషయం తెలిస్తే ఆ విషయాన్ని మనకు అప్పటికే తెలిసిన విషయంతో పోల్చుకోవాలి. అలా అర్థం చేసుకుంటే సులభంగా ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవడం సాధ్యమవుతుంది. మనం వస్తువులను ఎల్లప్పుడూ ఒకే ప్రదేశంలో ఉంచటానికి ప్రయత్నించాలి. 
 
అలా చేయడం ద్వారా మనకు ఆ వస్తువు కావాల్సిన సమయంలో సులభంగా దొరుకుతుంది. మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలను మనసులో ఊహించుకోవాలి. అలా చేస్తే ఆ విషయాలను ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోవడం సాధ్యమవుతుంది. షార్ట్ కట్స్ ద్వారా కీలకమైన విషయాలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. ఏవైనా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఉంటే వాటిని ఎమోషనల్ గా కనెక్ట్ చేసుకోవాలి. అలా చేస్తే వాటిని సులభంగా మరిచిపోయే అవకాశాలు తక్కువగా ఉండటంతో పాటు మనం ఏ విషయాలను మరిచిపోమనే నమ్మకం మనపై మనకు వస్తే జ్ఞాపకశక్తి సులభంగా పెరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: