Air India: జస్ట్ మిస్..లండన్ బయలుదేరిన మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం..!
ఇలాంటి మూమెంట్లోనే మరొక ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది అన్న వార్త బయటకు వచ్చింది . తాజాగా ముంబై నుంచి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమామానం మూడు గంటల ప్రయాణం తర్వాత మళ్లీ తిరిగి వెనక్కి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు . అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ సిచువేషన్ నెలకొంది . అందుతున్న వివరాల ప్రకారం ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య ఎంత ఉధృత వాతావరణం నెలకొందో అందరికీ తెలిసిందే .
ఇరాన్ - ఇజ్రాయిల్ దాడుతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది . ఇజ్రాయిల్ వైమానిక దాడుల కారణంగా గగన తలంపై కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి . ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం సుమారు 5:39 నిమిషాలకు ముంబై నుంచి లండన్ కు బయలుదేరింది ఎయిర్ ఇండియా విమానం . అయితే ఈ ఎయిర్ ఇండియా విమానం మూడు గంటల ప్రయాణం తర్వాత రాడర్ లో సిగ్నల్ సమస్య తలెత్తిన కారణంగా తిరిగి విమానం వెనక్కి వచ్చేసింది. ఫ్లైట్ రాడర్ 24 ద్వారా ఈ విషయం నిర్ధారణ అయింది . అయితే రాడర్ సిగ్నల్ సమస్య కారణంగా విమానం వెనక్కి రావడం ఒక భారీ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగినట్టయింది. రాడర్ సమస్య కారణంగా విమానం వెనక్కి మళ్లించినట్లు సమాచారం అందుతుంది . అంతేకాదు ప్రయాణికులంత సురక్షితంగా సేఫ్గా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది . విమానం తిరిగి వస్తుందని తెలుసుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు - బంధువులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగింది ..? అనే విషయంపై ఆరాతీస్తున్నారు..!!