అర్ధరాత్రి ఎర్రటి ఎండ.. షాకింగ్ వీడియో వైరల్?

praveen
అర్ధరాత్రి సూర్యుడు మాడిపోవడం ఏమిటని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. సాధారణంగా అర్ధరాత్రి అంటే అంతటా కారుచీకటిగానే ఉంటుంది. కానీ అంటార్కిటికాలో అలా కాదు. భూమికి అత్యంత దక్షిణ కొసన ఉన్న ఈ ఖండంలో వాతావరణం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడే భౌగోళిక దక్షిణ ధ్రువం ఉందని మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. దక్షిణ మహాసముద్రం మొత్తం ఈ ఖండాన్ని వ్యాపించి ఉంటుంది. 1,42,00,000 చ.కి.మీ విస్తీర్ణంతో, ఇది 5వ అతిపెద్ద ఖండంగా పరిగణించబడింది. అంటే ఆస్ట్రేలియాకు దాదాపు 2 రెట్లు ఎక్కువన్నమాట. చదరపు కిలోమీటరుకు 0.00008 మంది జనాభాతో, ఇది అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన ఖండంగా పిలవబడుతోంది. ఎందుకంటే అంటార్కిటికా దాదాపుగా 98% ఐసుతో కప్పబడి ఉంటుంది. ఈ ఐసు సగటు మందం 1.9 కిలోమీటర్లు ఉంటుంది. అందుకే ఇక్కడ మనుషులు అంతగా జీవించడానికి అనువుగా ఉండదు.
ఇక అసలు విషయంలోకి వెళితే... అర్ధరాత్రి అక్కడ సూర్యుడు భగ్గుమంటూ ఉంటాడు. అవును, ఇక్కడ అర్ధరాత్రి సూర్యుడు వికసిస్తుంటాడు. ఫిబ్రవరి వరకు స్కాట్ బేస్ లేదా మెకముర్డో స్టేషన్లో సూర్యుడు అస్తమించడని తాజాగా ఓ వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దాంతో ఈ విషయం తెలుసుకున్న జనాలు అవాక్కవుతున్నారు. సర్కంపోలార్ రొటేషన్ వల్ల సూర్యుడు 24 గంటలూ కనిపిస్తాడని, ఎప్పుడైనా అవుట్డోడోర్ యాక్టివిటీస్ చేయొచ్చని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే అత్యంత వేగంగా వీచే గాలులతో కూడుకుని ఉన్న ఖండంగా దీనిని పేర్కొంటారు. దీని సగటు ఎత్తు అన్ని ఖండాల కంటే ఎక్కువ. అంటార్కిటికాలో ఎక్కువ భాగం ధ్రువ ఎడారి. దాదాపు 20 లక్షల సంవత్సరాలుగా అక్కడ వర్షాలు పడలేదంటే మీరు నమ్ముతారా? అయినప్పటికీ, ప్రపంచపు మొత్తం మంచినీటి నిల్వలలో 80% అక్కడే ఉండడం కొసమెరుపు. అంటార్కిటికాలో ఉన్న మంచు పూర్తిగా కరిగితే, ప్రపంచ సముద్ర మట్టాలను 60 మీటర్లు పెరుగుతాయి. కాగా భూమ్మీద కనుక్కున్న చిట్టచివరి ప్రాంతం అంటార్కిటికాగా రికార్డుల్లోకి ఎక్కింది. 1820 వరకు దాదాపుగా దీని గురించి ఎవరికీ తెలియదు. రష్యన్ సాహసికులు ఫాబియన్ గొట్లియేబ్ వాన్ బెల్లింగ్షౌసెన్, మిఖాయిల్ లాజరేవ్ లు వోస్టోక్, మిర్నీలపై చేసిన యాత్రలో ఫింబుల్ ఐసు పలకను కనుగొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: