షర్ట్ ఐరన్ చేసే ఛాలెంజ్.. కానీ ఎంత డేంజరస్ గా ఉందో చూడండి?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి వరకు పాకిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియా అనే మాయలో మునిగితేలుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి కూడా చేస్తూ ఉంటాయి. మరికొన్ని  భయాందోళనకు కూడా గురి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.

 సోషల్ మీడియాలో ఎప్పుడు సరికొత్త చాలెంజ్ లు పుట్టుకొస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎవరైనా ఏదైనా ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం ఇక మరొకరిని ఆ విన్యాసం చేయమని ఛాలెంజ్ విసరడం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని విన్యాసాలు ఏకంగా ప్రాణాలనే రిస్క్ లో పెట్టే విధంగా ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా విన్యాసం గురించే. ఇంతకీ చాలెంజ్ యాక్సెప్ట్ చేసిన వారు ఏం చేయాలో తెలుసా.. ఒక షర్ట్ ఐరన్ చేయాలి. ప్రమాదకరమైన విన్యాసం అంటే ఇంకా ఏదో అనుకున్నాం. ఊరికే షర్ట్ ఐరన్ చేయడమేన.. ఇది కూడా ఒక ఛాలెంజ్ అంటారా అని మీరు అనుకుంటున్నారు కదా.

 అలా అనుకున్నారు అంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మీరు అన్నట్లు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన వారు షర్ట్ ఐరన్ చేయడం మాత్రమే చేయాలి. కానీ అందరిలా కాదు. ఏకంగా ప్రమాదకర రీతిలో ఇలాంటి ఛాలెంజ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది డేరింగ్ ఛాలెంజ్ చేసి అబ్బుర పరుస్తూ ఉంటారు. అయితే ఇలాంటి డేంజరస్ ఛాలెంజర్స్ లో ఎక్స్ట్రీమ్ ఐరనింగ్ ఛాలెంజ్ కూడా ఒకటి. నీటి లోపల, పర్వతాలపై, పారాచూట్ దూకడం వంటి వినాసాలు చేస్తూ షర్ట్ ఐరన్ చేయడమే ఈ ఛాలెంజ్. 1997లో ఇంగ్లాండుకు చెందిన ఫీల్ షా దీనిని ప్రారంభించాడు. 2003లో జాన్, బెన్ అనే ఇద్దరు ఎవరెస్టుపై ఈ ఛాలెంజ్ పూర్తి చేసి గిన్నిస్ బుక్ రికార్డు కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: