ఈ మధ్య కాలంలో
ఆటగాళ్ళకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేందంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూయింగ్ గమ్ నమలడానికి ఇష్టపడుతుంటారు. దీనిని నమలడం నోటికి ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెపుతుంటారు. నోటిలో చూయింగ్ గమ్ కావటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంతేకాదు.. దవడలను కూడా బలపరుస్తుంది. ఇది బ్యాక్టీరియా మొత్తాన్ని 75 శాతం తగ్గిస్తుంది. చూయింగ్ గమ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.ఇదిలావుండగా క్రికెట్ గ్రౌండ్ లో ఆటగాళ్ళు చూయింగ్ గమ్ నములుతుండటాన్ని మీరు చూసే ఉంటారు. ప్రత్యేకంగా కనిపించేందుకే వారు అలా చేస్తుంటారని చాలామంది అనుకుంటారు. అయితే దానివెనుకనున్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి దీని వెనుక శాస్త్రీయ కారణం ఉంది. ఆటలో తమ దృష్టిని పెంచుకోవడానికి ఆటగాళ్ళు చూయింగ్ గమ్ నమలుతారు. చూయింగ్ గమ్ నమలడం వల్ల ఆటపై ఫోకస్ ఎలా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గమ్ నమిలే సమయంలో నోటిలోని రుచి గ్రాహకాలు, దవడ ఒత్తిడి మెదడుకు కోస్టార్ సంకేతాలను పంపుతూనే ఉంటాయి. మెదడు ఈ సంకేతాలను ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. ఈ విధంగా మనస్సు అలర్ట్ మోడ్‌లో ఉండి, సూక్ష్మాంశాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. శారీరక కార్యకలాపాలు పెరిగినప్పుడు మెదడుకు ఎక్కువ రక్తం అవసరమవుతుంది.అటువంటి పరిస్థితిలో మెదడులో రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. దీని కారణంగా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. ఫలితంగా కండరాలలో రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. ఈ విధంగా చూయింగ్ గమ్ నమలడం ద్వారా మనసు ఏకాగ్రమవుతుంది. తద్వారా ఆటగాడు తన ఆటను మెరుగ్గా ఆడగలుగుతాడు. చూయింగ్ గమ్ త్వరగా నమలడం వల్ల ఎక్కువ ఫోకస్ వస్తుందని, నెమ్మదిగా నమలడం వల్ల తక్కువ ఫోకస్ పెరుగుతుందనేది కొంత వరకు నిజం. రుచి కలిగిన చూయింగ్ గమ్ నమలడం మరింత ప్రయోజనకరంగా పరిగణిస్తారు.