ఈ ఏడు రంగుల పర్వతం గురించి తెలుసా.. ఇది ఎక్కడ ఉందంటే?
ఇక అలాంటి ప్రకృతి అందాలను చూసి తెగ ఆనంద పడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒక్కసారైనా అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని తెగ ఆశపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ప్రదేశం గురించే. అది ఒక పెద్ద పర్వతం. పర్వతం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఎత్తు. ఇక పర్వతాలు అంటేనే భారీ ఎత్తులో ఉంటాయని.. చాలామంది పర్యటకులు అక్కడికి వెళ్లి వస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పర్వతం మాత్రం ఒక అందమైన ప్రకృతి సౌందర్యం.
ఎందుకంటే ఇప్పటివరకు పర్వతాలు ఎలా ఉంటాయో అందరూ చూసే ఉంటారు. కానీ ఇది ఏకంగా రంగురంగుల పర్వతం. హరివిల్లును తలపించే విధంగా ఈ పర్వతం కనిపిస్తూ ఉంటుంది. ఏకంగా 5200 మీటర్ల ఎత్తు అయినా ఈ పర్వతం ఏడు రంగులలో కనిపిస్తూ ఉంటుంది. పెరులో ఉండే ఈ పర్వతం పేరు విని కుంక. విభిన్న ఖనిజాల కారణంగా ఇక్కడ పర్వతంపై ఏడు రంగులు కనిపిస్తూ ఉంటాయి అని పరిశోధకులు చెబుతున్నారు. కక్సో ప్రాంతం నుంచి దీన్ని చూసేందుకు వెళ్లొచ్చు. శిఖరం ఎక్కిన తర్వాత కొండ అసలు అందరం ఆవిష్కృతం అవుతుంది. స్థానికులు దీన్ని భూమాతకు ప్రతిరూపంగా పవిత్రంగా భావిస్తూ ఉంటారు.