ఛార్జింగ్ పెట్టి నిద్రపోయాడు.. లేచే సరికి శవమయ్యాడు.. అసలేం జరిగిందంటే?

praveen
మొబైల్స్‌కు ఛార్జింగ్ పెట్టే విషయంలో చాలామంది యూజర్లు తప్పులు చేస్తూ ప్రమాదాల్లో పడుతున్నారు. కొందరైతే ఏకంగా మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా ప్రజలు అప్రమత్తం కావడం లేదు. వీటి గురించి నిపుణులు అవగాహన కల్పించడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. అయినా సరే ఫోన్ చార్జింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు ప్రాణాలు కోల్పోయి కన్నవారికి, కట్టుకున్న వారికి తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నారు. వీరే ఆధారం అని బతుకుతున్న సభ్యులను రోడ్డున పడేస్తున్నారు. అందుకే మృత్యువు రూపంలో ఉన్న ఫోన్ ఛార్జింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా ఒక వ్యక్తి అజాగ్రత్తతో ఫోన్ చార్జింగ్ పెట్టి చివరికి షాక్ కొట్టి మరణించాడు.
 అత్యంత విషాదకరమైన ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ లో చోటుచేసుకుంది. యాచారం మండలానికి చెందిన మాలోత్‌ అనిల్ నిన్న రాత్రి పడుకునే ముందు మొబైల్ కి ఛార్జింగ్ పెడదాం అనుకున్నాడు. అయితే చార్జింగ్ వైరు అందలేదు దాంతో ఎక్స్‌టెన్షన్ ప్లగ్ బాక్స్ దగ్గర పెట్టుకొని దానికే మొబైల్ చార్జింగ్ పెట్టుకుని పడుకున్నాడు. నిద్రలో పొరపాటున అతను తన కాలును ప్లగ్ బాక్స్ పై వేశాడు అంతే సారిగా గట్టిగా అతనికి కరెంట్ షాక్ తగిలింది. అంతే గిలగిలా కొట్టుకుంటూ క్షణాల్లోనే ప్రాణాలు విడిచాడు. కొన్నేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. వారితో కలిసి ఒక బిడ్డకు జన్మనిచ్చాడు ఆ చిన్నారి వయసు కేవలం ఒక సంవత్సరమే. పసివయసులోనే ఆ చిన్నారికి తండ్రి దూరమయ్యాడని మృతుడి భార్య ఎంతో తలడిల్లుతోంది.
 సంఘటన స్థలానికి వచ్చే బాడీని పరిశీలించిన పోలీసులు మొబైల్ ఫోన్ చార్జింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇకపోతే క్వాలిటీ లేని ఎలక్ట్రానిక్ చార్జర్లు, ప్లగ్ బాక్సులు వాడటం కూడా ప్రాణానికి ప్రమాదమే. పడుకునేటప్పుడు కారణాలు తీసేసే వస్తువులను దగ్గరలో ఉంచుకోకూడదు. మస్కిటో కాయిల్స్ కూడా ప్రజల ప్రాణాలను తీసేసిన ఘటనలు ఉన్నాయి. అలాగే స్నానం చేసి చార్జింగ్ లో ఉన్న మొబైల్ ఫోన్ పట్టుకోకూడదు. గతంలో ఒక మహిళ అలాగే చేసి షాక్ కొట్టి చనిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: