కండలవీరుడిని వెంటాడుతున్న హిస్టరీ..గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ తో పగ.?

FARMANULLA SHAIK
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం 1990ల నుండి ముంబై నగరంతోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆధిపత్యం కోసం ప్రయత్నించాడు. అప్పట్లో గ్యాంగ్ వార్ జరిగింది.ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి ముంబైలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్సీపీ నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సిద్ధిఖీ హత్యతో అటు బాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. నార్త్ ఇండియాలో ప్రభంజనం సృష్టించిన లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు బాలీవుడ్ లో భీభత్సం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దావూద్‌ ఇబ్రహీం ఏలిన బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ భావిస్తున్నారా? సొంతంగా – D-కంపెనీ ఏర్పాటు చేసే ఆలోచనలో లారెన్స్‌ ఉన్నారా? ఈ ప్రశ్నలకు పోలీసుల నుంచి అవుననే సమాధానం వస్తోంది.బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ మాటలకు చాలా విలువ ఉంటుంది. ఈ ముగ్గురూ బాబా సిద్ధిఖీకి దగ్గరి సన్నిహితులు. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బాబా సిద్ధిఖీని హత్య చేసి ఈ ముగ్గురు హీరోలకు ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌కు సందేశం పంపాడు.ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఈ లారెన్స్ బిష్ణోయ్ అనే ప్రశ్న.. 2024 ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి వచ్చింది. ఎందుకంటే అప్పుడే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పులు జరిపారు. అయితే అసలు సల్మాన్ ఖాన్ టార్గెట్ చేయాల్సిన అవసరం ఇతనికి ఏం వచ్చిందో చూద్దాం.

 లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ తో వైరం ఇప్పటిది కాదు. అతని కోపం చాలా ఏళ్ల క్రితం మొదలైంది. నిజానికి ఈ పగ లారెన్స్ ఒక్కడితే కాదు.. మొత్తం బిష్ణోయ్ వర్గానిది. అసలు మ్యాటర్ ఏంటంటే.. బిష్ణోయ్ లకు కృష్ణ జింక అనేది ఎంతో పవిత్రమైనది. అలాంటి కృష్ణ జింకను 1998లో సల్మాన్ ఖాన్ వేటాడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసు కూడా నడుస్తూనే ఉంది. బిష్ణోయ్ లకు పవిత్రమైన కృష్ణజింకను వేటాడంతోనే సల్మాన్ ఖాన్ కు బిష్ణోయ్ కి మధ్య వైరం మొదలైంది. 2018 నుంచి సల్మాన్ ఖాన్ ని లారెన్స్ గ్యాంగ్ టార్గెట్ గా పెట్టుకుంది. 2024లో మొదట సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ వద్ద లారెన్స్ గ్యాంగ్ రెక్కీ నిర్వహించింది. ఆ తర్వాత 2024 ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ ఇంటి మీద ఈ గ్యాంగ్ కాల్పులు జరిగింది. అప్పుడే వీళ్ల పేరు దేశవ్యాప్తంగా మారు మోగింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి.. సల్మాన్ ఖాన్ కి ప్రత్యేకంగా ఎలాంటి గొడవలు లేవు. కేవలం కృష్ణ జింక విషయంలోనే సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేశారు. తాజాగా ఈ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ కి ఓ ఆఫర్ కూడా ఇచ్చింది. సల్మాన్ గుడికి వచ్చి.. క్షమాణప చెబితే.. దానిని పరిగణలోకి తీసుకుంటాం అంటూ చెప్పుకొచ్చింది.ఇదిలావుండగా లారెన్స్‌ బిష్ణోయ్‌ జైల్లో ఉన్నా కూడా కార్యకలాపాలు యధేచ్ఛగా సాగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ల పట్టేంటో. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ D-కంపెనీ తరహాలోనే ఒక కార్పొరేట్‌ కంపెనీగా పనిచేస్తుంది. గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్నప్పటికీ తన గ్యాంగ్‌పై లారెన్స్‌ బిష్ణోయ్‌కు పూర్తి పట్టుంది. ప్రపంచంలోని ఏడు దేశాలలో ఒక నెట్‌వర్క్ సృష్టించాడు. ముందుగా సల్మాన్ ఖాన్‌ను బెదిరించడం ప్రారంభించాడు. ఇప్పుడు బాలీవుడ్‌ను శాసించేలా ఫూల్‌ప్రూఫ్ ప్లాన్‌తో పని చేయడం స్టార్ట్ చేశాడు బిష్ణోయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: