కొడుకు కోసం సైంటిస్ట్ గా మారిన తండ్రి.. ఏం కనిపెట్టాడో తెలుసా?

praveen

క్రియేటివిటీ ఎవరి సొత్తు కాదు. పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ఇలాంటి మాటలు ప్రతి ఒక్కరిలో కాన్ఫిడెన్స్ ని నింపుతూ ఉంటాయి. ఇక ప్రతి ఒక్కరికి ఏదైనా సాధించేస్తాం అనే ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి ధైర్యంతోనే కొంతమంది వినూత్నమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఏదైనా కొత్త పరికరాన్ని కనుగొనాలి అంటే అది కేవలం శాస్త్రవేత్తలకు మాత్రమే సాధ్యమవుతుంది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే శాస్త్రవేత్తలే ఎన్నో ప్రయోగాలు చేసి ఇలాంటి కొత్త పరికరాలను కనుగొనడం ఇప్పటివరకు చూశాం.

 అయితే శాస్త్రవేత్తలకు ఉండే కేవలం తెలివితేటలు మాత్రమే కాదు ఒక సాధారణ మనిషి జీవితంలో ఉండే సమస్యలు కూడా ఇలాంటి వినూత్నమైన ఆవిష్కరణలకు కారణం అవుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఏకంగా తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు తమలోని ఉన్న సృజనాత్మకతను బయటపెట్టి తయారు చేసే పరికరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఒక తండ్రి ఇదే చేశాడు. కొడుకు కష్టాన్ని చూసి తండ్రి చలించిపోయాడు. దూరంలో ఉన్న స్కూల్ కి వెళ్లేందుకు కొడుకు పడుతున్న ఇబ్బందులను చూసి ఎలాగైనా సమస్యను పరిష్కరించాలి అని అనుకున్నాడు.

 ఆయన పెద్ద శాస్త్రవేత్త ఏమీ కాదు. కానీ తనలో ఉన్న సృజనాత్మకతను బయటపెట్టి సరికొత్త పరికరాన్ని కనుగొన్నాడు. ఏకంగా సైంటిస్ట్ గా మారిపోయాడు. స్కూలుకు వెళ్లేందుకు కొడుకు ఇబ్బంది పడుతున్నాడని ఒక తండ్రి ఏకంగా సాదాసీదా సైకిల్ను ఎలక్ట్రికల్ బైక్గా మార్చేశాడు. చతిస్గడ్ లోని బాలోత్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంతోష్ సాహు వెల్డర్ గా పనిచేస్తున్నాడు. కొడుకు కిషన్ ఎనిమిదవ తరగతి చదువుతుండగా స్కూల్ కి వెళ్లి వచ్చేందుకు 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. దీంతో కొడుకు ఇబ్బందులు చూసి చలించిపోయిన తండ్రి ఏకంగా 30000 ఖర్చు చేసి సదాసీదా సైకిల్ కు బ్యాటరీని అమర్చి.. ఈ బైక్ ని తయారు చేశాడు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందట. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.. ఆ తండ్రి పట్టుదల చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.Your browser does not support HTML5 video.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: