వైరల్: మొబైల్లో అవి చూస్తున్నారా అయితే జైలుకే.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ..!
ఫోక్సో చట్టం ఈ విషయం పైన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అంటు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎవరు కూడా చైల్డ్ ఫోర్నుగ్రఫీ అనే పదాన్ని సైతం ఉపయోగించకూడదని ఇటీవలే ధర్మాసనం కూడా ఆదేశాలను జారీ చేసిందట. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు కూడా ఒక సంచలన తీర్పు ఇవ్వడంతో వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.. 28 ఏళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు చైల్డ్ పోర్నో గ్రఫీ వీడియోలను సైతం డౌన్లోడ్ చేసుకున్నారని ఫోక్సో చెప్పటానికి కింద అరెస్టు చేయడం జరిగిందట. ఆ యువకుడిని కోర్టులో కూడా హాజరపరిచారు.
దీంతో కోర్టు ఇతడికి శిక్ష కూడా ఖరారు చేయడంతో వెంటనే ఆ యువకుడు మద్రాసు హైకోర్టును సైతం ఆశ్రయించడం జరిగింది. విచారణ అనంతరం హైకోర్టు ఇలా తీర్పుని విడుదల చేస్తూ.. వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ ఆ యువకుడు ఎవరికి షేర్ చేయలేదు కానీ ఎలాంటి వేధింపులకు గురి చేయలేదనీ గుర్తించిన కోర్టు ఆ యువకుడు మీద క్రిమినల్ చర్యలు నిలిపివేయాలి అంటూ ఈ ఏడాది జనవరిలో మద్రాస్ హై కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో కూడా చాలానే దాఖలు రావడంతో.. ఈ రోజున విచారణ జరుపబోతున్నారట.. మద్రాస్ హైకోర్టు తీర్పును న్యాయవాదులు తప్పుబడుతూ చైల్డ్ ఫోర్నోగ్రఫీ ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా ఫోక్సో చట్టం కిందికే వస్తుంది అంటూ ఇది కూడా నేరమే అంటూ తెలియజేస్తున్నారట. అందుకే మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హైకోర్టు హెచ్చరిస్తోంది.