హ్యాండ్సప్ బాసు.. మీలాంటోళ్లే సమాజానికి అవసరం..
ఇందులో భాగంగా కొందరు మెకానికులు విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహాయం చేయాలన్న సదుద్దేశంతో విజయవాడ విద్యాధరపురంలో ఉచితంగా గ్యాస్ స్టవ్స్ రిపేర్ చేస్తున్నామని ఓ పోస్టర్ లో తెలియజేశారు. అకస్మాత్తుగా వచ్చిన వరద ముప్పు వల్ల వరద బాధితుల సహాయార్థం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు.. ఓ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. వర్షాల కారణంగా ఎవరివైనా గ్యాస్ స్టవ్ రిపేర్ కి వస్తే ఇక్కడికి వచ్చి ఉచితంగా రిపేర్ చేయించుకోవచ్చని అక్కడ వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వెలిసిన ఫ్లెక్సీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫ్లెక్సీని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు అతడిని ప్రశంసిస్తున్నారు. తన వృత్తి ద్వారా వరద బాధితులకు ఎలా సహాయం చేయాలన్న ఆలోచన రావడం నిజంగా గొప్ప విషయమని., అంతే కాకుండా అతడు సొసైటీకి ఎలా ఉపయోగపడుతున్నాడో అన్నదానిపై కూడా కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం విజయవాడ నగరంలో వరద తగ్గుముఖ పట్టడంతో ప్రభుత్వ అధికారులు ఎంత నష్టం జరిగిందన్న విషయంపై లెక్కలు వేస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా బాధితులకు ఇంటి దగ్గరికి వెళ్లి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని సర్వే సమయంలో బాధితులు ఇల్ల వద్ద అందుబాటులో ఉండాలని రెవెన్యూ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు మూడు రోజులపాటు రెవెన్యూ శాఖ ఈ సర్వే నిర్వహిస్తుందని.. కాబట్టి., ప్రభుత్వ అధికారులు మీ ప్రాంతంలో ఉన్న సమయంలో ఇంట్లోని యజమాని వారు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలని అధికారులు తెలిపారు.