భోజనానికి కూర్చున్న దంపతులు.. కానీ ఇంతలో ఎంత ఘోరం జరిగిందో చూడండి?

praveen
విధి ఆడే వింత నాటకంలో మనిషి జీవితం అనేది కేవలం కీలుబొమ్మ లాంటిది మాత్రమే అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. మనిషి జీవితంలో ఎప్పుడూ ఎలాంటి అనూహ్యమైన ఘటనలు చోటు చేసుకుంటాయి అని ముందుగా ఊహించడం చాలా కష్టం. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కొన్ని అనూహ్యమైన ఘటనలు ఏకంగా ప్రాణాల మీదికి తీసుకువస్తూ ఉంటాయి. ఇలాంటి ఘటనల్లో అప్పటి వరకు సంతోషంగా ఉన్న వాళ్ళు ఏకంగా నిమిషాలు వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

మరికొన్ని ఘటనల్లో ఊహించని ప్రమాదాల బారిన పడి చివరికి తీవ్ర గాయాల పాలు కావడం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రపంచమంతా పాకిపోయిన నేపథ్యంలో ఇక ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇంటర్నెట్లో వాలిపోతుంది. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. రెప్పపాటు కాలంలో జరిగే ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.

 ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఇద్దరు దంపతులు రాత్రి సమయంలో భోజనం చేయడానికి సిద్ధమయ్యారు. టేబుల్ పై ఆహారం కూడా పెట్టుకున్నారు. ఇక అంతా సాఫీగా ఉంది అనుకుంటున్న సమయంలో రెప్పపాటు కాలంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఏకంగా ఆ ఇంటి గోడను బద్దలు కొట్టుకుంటూ ఒక కారు ఇంట్లోకి దూసుకు వచ్చింది. ఇక దీంతో ఆ ఇంట్లో మొత్తం ఒక్కసారిగా పొగ కమ్ముకుంది. ఈ వీడియోలో ప్రమాదం చూసిన తర్వాత దంపతులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు అని అందరూ అనుకుంటారు. కానీ అదృష్టవశాత్తు ఆ ఇద్దరు గాయలతో బయటపడ్డారు. ఈ ఘటన అమెరికాలోని హరిజోనాల్లో ఫినిక్స్ లో చోటుచేసుకుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: