విదేశాలలో కూడా వ్యవసాయ రంగానికి సంక్షోభం..!
దాదాపుగా 50 లక్షల ఎకరాలు నీళ్లు ఆపేశారట. ఇది అమెరికన్ గవర్నమెంట్ చేసినటువంటి కీలకమైన అంశం అన్నట్లుగా తెలుస్తోంది. ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే... యదాహో అన్నటువంటి ప్రాంతం దగ్గర జరిగిందట. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇది పెద్ద ఎత్తున అమెరికాకు సంబంధించి రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఆఫ్ మిలియన్ యాకర్ అక్కడ రిస్క్ లో పడిందట అలా ఎందుకు జరిగిందంటే.. నీళ్లు ఆగిపోవడం వల్ల.. ఎందుకు ఆపేశారు అంటే.. ఆ ప్రాంతంలో కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయానికి సంబంధించి అగ్రిమెంట్ ఇచ్చారట. దానికి ఈ రైతులు ఒప్పుకోరు కాబట్టి ఇలా చేశారనే విధంగా తెలుస్తోంది.
రైతులను ఇబ్బంది పెడితే .. ఖచ్చితంగా ఆ సంస్థలకు తమ భూమిని ఇచ్చేస్తారు కాబట్టి.. అందుకోసమే ఇలాంటి పని చేసినట్లుగా ఇప్పుడు అక్కడున్నటువంటి వ్యవసాయ మద్దతుదారులు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన ఆటు అమెరికన్ ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుందో చూడాలి మరి. రైతులు ఎక్కడ ఉన్నా కూడా వారు ఇబ్బంది పడుతూనే ఉన్నారని చాలామంది నేతలు ఇప్పటికే తెలియజేశారు. అంతేకాకుండా వీరి కోసం ఎన్నో సదుపాయాలను చేస్తామంటూ ఎన్నికల ముందు చెప్పిన నేతలు కూడా మాట తప్పుతున్నారు. ఇలా అయితే రాబోయే రోజుల్లో రైతాంగం చేసేవారు కూడా ఉండాలని చెప్పవచ్చు.