తమిళనాడు: కమలా హారిస్ పై ప్రత్యేక ప్రేమ.. అసలు కారణం ఏంటంటే..?

Divya
డెమొక్రటిక్ పార్టీ తరఫు నుంచి అధ్యక్ష అభ్యర్థిగా వైదొలగినటువంటి అధ్యక్షుడు జో బ్రైడెన్  ప్రకటించడం వల్ల ఆస్థాన ఎవరు దక్కించుకుంటారనే విషయం పైన చాలా ఉత్కంఠంగా కొనసాగింది.. అయితే ఎన్నికల రేసు నుంచి బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలహరిస్ పేరుని సైతం తెలియజేశారు.. దీంతో కమలా తల్లి శ్యామల గోపాల స్వగ్రామమైన తమిళనాడులో తులసింద్రపురంలో ఒక్కసారిగా ఆనందచాయలు కనిపించాయి.. ముఖ్యంగా ఈమె బంధువులు అక్కడ ఉండే ఆలయాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ కొన్ని ఫ్లెక్సీలను కూడా వేయించడం జరిగింది.

2019లో అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి కమలా హరిస్ ఎన్నికైనప్పుడు ఆ విషయాన్ని ఒక పండుగల జరుపుకున్నామని ఈసారి ఎన్నికలలో ఆమె విజయం సాధించడం ఖాయం అంటూ తెలియజేశారు. అగ్ర రాజ్యానికి అధ్యక్షురాలు అయిన తర్వాత ఈమె భారత దేశ అభివృద్ధికి సహాయపడుతుందని విషయం మా కోరికగా ఉందని కమలా హరీష్ బంధువులు ఆనంద్ తెలియజేశారు.. అలాగే తమ బంధువైన కమలా హరిస్ పేరును ప్రతిపాదించడం తమకు  చాలా ఆనందంగా ఉందంటూ తెలియజేశారు. కమలా విజయం కోసమే ఆ దేవుడిని సైతం ప్రార్థిస్తున్నామని ఎన్నికలలో గెలిచి భారత్కు రావాలని తెలియజేశారు.

అయితే కమలా హరిస్ కుటుంబం ఇప్పటికీ తమకు మూలాలు ఉన్న తులసింద్రపురం గ్రామంలో ప్రజలతో సన్నిహితంగానే ఉంటోందట. ఆమె తల్లి పేరు శ్యామల.. శ్యామల మరణించడంతో కమలా తల్లి ఆస్తికలు హిందూ సాంప్రదాయ ప్రకారంలోనే  తన సోదరి మాయాతో కార్యక్రమాన్ని పూర్తి చేసిందట. సోదరి కూడ చెన్నైలో ఉంటున్నట్లు తెలుస్తోంది. అలాగే కొంతమంది బంధువులు తులసింద్రపురంలో నివాసం ఉంటున్నారట. ఆమె పూర్వీకుల గుడి అయిన ధర్మశాస్త్ర దేవాలయం తులసింద్రపురంలో ఉండడం చేత .. కమలా హరిస్ కూడా  గత కొన్ని ఏళ్ల క్రితం ఆలయానికి భూమి విరాళం కూడా ఇచ్చిందట. అలా ఆలయ శాసనంలో ఆ వివరాలు కూడా నమోదు చేయించినట్లు తెలుస్తోంది. అమెరికాలో మొట్టమొదటి తొలి మహిళ ఉపాధ్యక్షురాలుగా పేరుపొందింది.. దక్షిణాసియా సంతతికి చెందిన మొదటి వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఈమె పేరు సంపాదించింది. 59 ఏళ్ల కమలహరి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమోదం లభించింది అంటే ఇది అమెరికాలోనే ఒక చరిత్రగా మిగిలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: