పగలు కంటే రాత్రి.. రైళ్లు ఎందుకు వేగంగా వెళ్తాయో తెలుసా?

praveen
భారత రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కోట్లాదిమంది ప్రయాణికులు ఇక ఈ రైల్వే మార్గం ద్వారానే తమ ప్రయాణాలను సాగిస్తూ ఉంటారు. ఇక కొంతమంది అయితే జీవితంలో రైలు ప్రయాణం అనేది ఒక భాగంగా మారిపోతూ ఉంటుంది. ప్రతిరోజు ఎక్కడికి వెళ్లాలన్నా రైలు మార్గం ద్వారానే వెళ్లే పరిస్థితి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇతర ప్రయాణాలతో పోల్చి చూస్తే ట్రైన్ ప్రయాణం ఎంతో చౌకగా ఉంటుంది. కాబట్టి చాలామంది రైల్వే ప్రయాణాల వైపు ఎక్కువగా మగ్గుచూపుతూ ఉంటారు.

 అయితే ఇక రైల్వే ప్రయాణాలు చేసిన ఎంతోమంది ట్రైన్ గురించి తమకు అన్ని విషయాలు తెలుసు అని అనుకుంటూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అని చెప్పాలి. సాధారణంగా పగలుతో పోల్చి చూస్తే రాత్రి సమయంలో రైలు కాస్త ఎక్కువ స్పీడుగా వెళ్తుంది అన్న విషయం తెలిసిందే. ఇలా ఎందుకు వెళ్తుంది అన్న విషయం చాలామందికి తెలియదు. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసుకుందాం..

 తక్కువ ట్రాఫిక్  : సాధారణంగా అయితే పగటిపూట గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇక రైల్వే నిర్వహణ పనులు కూడా జరుగుతూ ఉంటాయి  తద్వారా ఇక రైలు వేగం మందగిస్తూ ఉంటుందట.
 ఉష్ణోగ్రత  : పగటితో పోల్చి చూస్తే రాత్రివేళ ఉష్ణోగ్రతలో ఎంతో మార్పు ఉంటుంది. తద్వారా పట్టాలపై రాపిడి తక్కువగా ఉండడం కారణంగా రైళ్ల వేగం రాత్రి ఎక్కువగా ఉంటుందట.

 సిగ్నల్ : రాత్రులు ప్యాసింజర్ రైళ్లు  సంఖ్య తక్కువగా ఉంటాయి. కాబట్టి సిగ్నల్స్ కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే తరచూ ఆగాల్సిన అవసరం లేకపోవడంతో రైళ్లు వేగంగా వెళ్తాయట.

 నిర్వహణ : సాధారణంగా పగటిపూట ఎక్కువగా రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు నిర్వహణ పనులు చేయడం చూస్తూ ఉంటాం. అందుకే పగటితో పోల్చి చూస్తే రాత్రులే రైలు వేగంగా వెళుతుందట. ఇది మాత్రమే కాకుండా రాత్రి వేళల్లో  జంతువులు పట్టాల పైకి వచ్చే అవకాశం తక్కువగా ఉండడం.. ఇక రాత్రిపూట ఉండే వాతావరణం లాంటి అంశాలు కూడా రైలు వేగంగా వెళ్లడానికి కారణం అవుతాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: